
వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్ సెమీఫైనల్స్‌కు చేరకపోయినప్పటికీ.. తమ అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో పోరాడి అఫ్గానిస్తాన్ ఓడింది. ఈ మెగా టోర్నీలో అఫ్గాన్ జట్టుతో పాటు ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా సత్తాచాటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఈ అఫ్గాన్ ఆల్‌రౌండర్ దుమ్ములేపాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 97 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు భారత్, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో కూడా ఒమర్జాయ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 353 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఒమర్జాయ్‌పై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఒమర్జాయ్ కచ్చితంగా ఐపీఎల్ 2024లో కాంట్రాక్ట్ పొందుతాడని చోప్రా జోస్యం చెప్పాడు.
"ఒమర్జాయ్ అద్భుతమైన ఆల్‌రౌండర్. అతడు ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందుతాడని నేను భావిస్తున్నాను. డిసెంబర్ 19న జరగనున్న వేలంలో లక్నో ఫ్రాంచైజీ అతడని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రొమారియో షెపర్డ్‌ని ముంబై ట్రేడింగ్ చేసింది.
దీంతో లక్నో ఫ్రాంచైజీలో ఆల్‌రౌండర్ కోటా ఖాళీ అయింది. ఈ క్రమంలో ఆ స్ధానాన్ని ఒమర్జాయ్‌తో భర్తీ చేసుకునే అవకాశం ఉందని" తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది.