అంబానీతో పాండ్యా (PC: IPL/mipaltan)
‘‘ముంబై ఇండియన్స్‌తో పోలిస్తే అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ పూర్తి భిన్నమైనది. ఇరు ఫ్రాంఛైజీల సంస్కృతి, లక్ష్యాలు వేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమయ్యేందుకు 2021లో సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లు చెల్లించింది.
అయితే, ఎంఐ ఫ్రాంఛైజీ ఇందుకు భిన్నమైనది. అతిపెద్ద వ్యాపార కుటుంబం ఈ ఫ్రాంఛైజీని నడిపిస్తోంది. మరోవైపు.. సీవీసీ అనేది ఒక పెట్టుబటి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సీవీసీకి 40 మంది మేనేజింగ్ పార్ట్‌నర్లు, ఆయా చోట్ల 29 స్థానిక కార్యాలయాలు ఉన్నాయి.
ఆ సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్‌లో గుజరాత్ టైటాన్స్ ఒక ప్రత్యేకమైన పోర్ట్‌ఫొలియోలో లిస్ట్ అయింది. నిజానికి హార్దిక్‌ను ట్రేడ్ చేయడం ద్వారా గుజరాత్ టైటాన్స్ పర్సు రూ. 15 కోట్ల మేర ఖాళీ అయింది.
అయితే, దానిని పూడ్చడంతో పాటు ట్రేడింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ ఫీజు కూడా లభించింది. అయితే, అది ఎంత మొత్తం అన్నది కేవలం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు.
కానీ ఇందుకు సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రూ. 100 కోట్లకు హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ జరిగిందనేది వాటి సారాంశం’’... టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి తాజాగా వినిపిస్తున్న వార్తలు.
నెట్టింట చర్చకు దారితీసిన ట్వీట్
ఈ మేరకు.. ‘‘హార్దిక్ ఎంఐకి వెళ్లిపోయేందుకు గుజరాత్ టైటాన్స్ ఎందుకు అంగీకరించింది?’’ అన్న శీర్షికతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించినట్లు క్రికెట్ గురించి అప్‌డేట్లు అందించే ఎక్స్ యూజర్ ముఫద్దాల్ వొహ్రా చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది.
అంతసీన్ లేదు
ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఈ పోస్ట్‌కు వీక్షణలు లభించడం విశేషం. అయితే, ఈ విషయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. హార్దిక్‌కోసం మరీ 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పని లేదని.. ఇలాంటివి కేవలం హైప్ క్రియేట్ చేసేందుకే సృష్టిస్తారని పేర్కొంటున్నారు.
బంగారు బాతు.. పైసా వసూల్ పెర్ఫామెన్స్ గ్యారెంటీ
మరికొందరు మాత్రం.. ‘‘హార్దిక్ పాండ్యా బంగారు బాతు లాంటివాడు. అతడి కోసం ముంబై ఒకవేళ నిజంగానే వంద కోట్లు ఖర్చు పెట్టినా అందుకు రెట్టింపు పైసా వసూల్ ప్రదర్శన ఇస్తాడు’’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కష్టకాలంలో గుజరాత్ కెప్టెన్‌గా
ముంబై ఇండియన్స్ ఆఫర్ మేరకు గుజరాత్ టైటాన్స్‌ను వీడి తిరిగి సొంతగూటికి చేరాడు. తనకు లైఫ్ ఇచ్చినప్పటికీ.. గడ్డుకాలంలో తనను వదిలించుకున్న ముంబై వైపే మొగ్గు చూపి టైటాన్స్‌కు వీడ్కోలు పలికాడు. కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. పాండ్యాను కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది.
భారీ ఆఫర్ ఇచ్చిన ముంబై.. టైటాన్స్ పాండ్యా టాటా
అంతకు ముందు సారథిగా పనిచేసిన అనుభవం లేకపోయినా.. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా హార్దిక్‌పై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించింది. అందుకు తగ్గట్లుగానే హార్దిక్.. అరంగేట్ర సీజన్‌లోనే టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఫైనల్‌కు కూడా తీసుకువచ్చాడు.
అయితే, అనూహ్యంగా ముంబై ఇండియన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని టైటాన్స్‌కు టాటా చెప్పాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.
చదవండి: Ind vs SA: వికెట్ కీపర్ విషయంలో ద్రవిడ్ క్లారిటీ .. తప్పుబట్టిన మాజీ క్రికెటర్
Hardik Pandya's trade details (Indian Express): pic.twitter.com/MNiN5grdYC
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 24, 2023
Comments
Please login to add a commentAdd a comment