హార్దిక్ పాండ్యా (Image Source: Twitter/IPL)
ఐపీఎల్-2024 సీజన్‌కు ఇంకా 5 నెలల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటినుంచే సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఈ ఐపీఎల్-17వ సీజన్‌కు వేలానికి ముందు ఓ అనుహ్య మార్పు చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి చేరాడు. క్యాష్ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
తొలి రెండు సీజన్లలో గుజరాత్‌ను ఓ సారి ఛాంఫియన్స్‌గా.. మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా అనూహ్యంగా ఫ్రాంచైజీ మారడంపై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. 2015 సీజన్‌లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో వేలంలో అతడినికి కనీస ధర రూ.10లక్షలకు ముంబై కొనుగోలు చేసింది.
ఆ తర్వాత 6 సీజన్‌ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్‌ను.. ఐపీఎల్-2022 వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో అరంగేట్ర సీజన్‌లోనే తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ట్రేడింగ్ ద్వారా కెప్టెన్ ఫ్రాంచైజీ మారడం ఇదేమి తొలిసారి కాదు. హార్దిక్ కంటే ముందు మరో ఇద్దరు కెప్టెన్లు క్యాష్ ట్రేడింగ్ ద్వారా ఫ్రాంఛైజీలు మారారు.
ఎవరెవరంటే?
అజింక్యా రహానే..
ట్రేడింగ్ రూపంలో ఫ్రాంచైజీ మారిన తొలి కెప్టెన్ టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే. ఐపీఎల్-2020 సీజన్‌కు ముందు రాజస్తాన్ నుంచి రహానేను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్-2011లో రాజస్తాన్ రాయల్స్‌కు రహానే సారథ్యం వహించాడు.
రవిచంద్రన్ అశ్విన్..
ఈ లిస్ట్‌లో రహానే తర్వాతి స్ధానంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అశ్విన్‌ను ఐపీఎల్-2020 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ నుంచి అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడింగ్ ద్వారానే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి హార్దిక్ కూడా చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment