ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విధ్వంసకర ఓపెనర్ పృథ్వీ షాను విడిచిపెట్టాలని ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయించకున్నట్లు సమాచారం. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కే పృథ్వీ షా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 సీజన్‌లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన పృథ్వీ షా.. ఢిల్లీ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్నాడు.
తన మొదటి మూడు సీజన్లలో పర్వాలేదన్పించిన ఈ ఢిల్లీ యువ ఓపెననర్.. ఆఖరి సీజన్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో 8 మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాలను అందజేయాల్సి ఉంటుంది.
చదవండి: World Cup 2023: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment