Courtesy:ipl.com
ఐపీఎల్-2024 సీజన్ వేలంకు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో రూ 17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను విడుదల చేయాలని ముంబై భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్-2023 వేలంలో అతడి భారీ అంచనాలతో ముంబై సొంతం చేసుకుంది. కానీ ముంబై నమ్మకాన్ని గ్రీన్ వమ్ముచేశాడు. తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 452 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ పెద్దగా అకట్టుకోలేకపోయాడు.
ఈ క్రమంలో అతడిని విడిచిపెట్టి వేలంలో తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని ముంబై వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్(రూ.8 కోట్లు)ను కూడా విడిచిపెట్టేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. గత సీజన్‌లో అర్చర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్‌లు ఆడిన అర్చర్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఆ తర్వాత గాయం కారణంగా స్వదేశానికి పయనమయ్యాడు. అయితే ఇప్పుడు ఆ జట్టు స్టార్‌పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సాధించడంతో అర్చర్‌ను ముంబై వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడి. అదే విధంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ రూపంలో ముంబై ఇండియన్స్ తిరిగిచ సొంతం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న ముంబై వేదికగా జరగనుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్ కోసం ఫ్రాంచైజీలు నవంబర్ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు విడిచిపెట్టే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment