ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రాబోయే ఐపీఎల్ ఎడిషన్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా దృవీకరించింది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వర్క్‌లోడ్, ఫిట్‌నెస్ దృష్ట్యా ఐపీఎల్-2024 అందుబాటులో లేడు.
ఐపీఎల్‌కు ముందు భారత్‌తో టెస్టు సిరీస్, టీ 20 ప్రపంచకప్‌తో తన పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బెన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది అని సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా బెన్ స్టోక్స్ గత కాలంగా మోకాలి గాయంతో బాధపడతున్నాడు. ఈ క్రమంలో భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ జట్టు భారత్‌కు రానుంది. ఇక ఐపీఎల్-2023 సీజన్ వేలంలో సీఎస్‌కే అతడిని ఏకంగా రూ. 16.25 కోట్ల భారీ ధరకు కొనగోలు చేసింది. కానీ అతడు మోకాలి గాయం కారణంగా గత సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
చదవండి: టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment