
ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం దుబాయ్ వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ పడేందుకు మొత్తం 10 ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది కేవలం 77 మంది మాత్రమే.
ఇక వన్డే వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రపై కాసుల వర్షం కురిపించే అవకాశముంది. ఈ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అభినవ్ ముకుంద్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. వేలంలో రవీంద్రను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందని ముకుంద్ జోస్యం చెప్పాడు.
జియో సినిమాతో ముకుంద్ మాట్లాడుతూ.. "అంతర్జాతీయ స్ధాయిలో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పంజాబ్ కింగ్ భారీగా ఖర్చుచేస్తుంది. ఈ సారి కొత్త కూడా ఆటగాళ్ల కోసం పంజాబ్ భారీ మొత్తం వెచ్చించే ఛాన్స్ ఉంది. ప్రపంచకప్‌లో అదరగొట్టన కివీ స్టార్ రచిన్ రవీంద్రను దక్కించుకోనేకుందు పంజాబ్ ప్రయత్నం చేస్తుంది.
టీ20ల్లో గణాంకాలు పెద్దగా బాగోలేకపోయినప్పటికి.. భారత్ పిచ్‌లపై ఏమి చేశాడో మనమందరం చూశం. టోర్నీలో 3 సెంచరీలతో ఏకంగా 578 పరుగులు చేశాడు. అదే విధంగా వచ్చే ఐపీఎల్ సీజన్ ప్లేఆఫ్స్‌కు బెయిర్ స్టో కూడా అందుబాటులో ఉండడు.
ఈ నేపథ్యంలో పంజాబ్ రవీంద్ర కోసం కచ్చితంగా ప్రయత్నిస్తోందని" చెప్పుకొచ్చాడు. వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న రవీంద్రకు టీ20ల్లో మాత్రం పెద్దగా రికార్డులు లేవు. 18 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా...
Comments
Please login to add a commentAdd a comment