Abhinav Mukund
-
పంజాబ్ కింగ్స్‌లోకి వరల్డ్‌కప్ హీరో.. టీమిండియా మాజీ ఓపెనర్ జోస్యం
ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం దుబాయ్ వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ పడేందుకు మొత్తం 10 ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది కేవలం 77 మంది మాత్రమే. ఇక వన్డే వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రపై కాసుల వర్షం కురిపించే అవకాశముంది. ఈ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అభినవ్ ముకుంద్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. వేలంలో రవీంద్రను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందని ముకుంద్ జోస్యం చెప్పాడు. జియో సినిమాతో ముకుంద్ మాట్లాడుతూ.. "అంతర్జాతీయ స్ధాయిలో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పంజాబ్ కింగ్ భారీగా ఖర్చుచేస్తుంది. ఈ సారి కొత్త కూడా ఆటగాళ్ల కోసం పంజాబ్ భారీ మొత్తం వెచ్చించే ఛాన్స్ ఉంది. ప్రపంచకప్‌లో అదరగొట్టన కివీ స్టార్ రచిన్ రవీంద్రను దక్కించుకోనేకుందు పంజాబ్ ప్రయత్నం చేస్తుంది. టీ20ల్లో గణాంకాలు పెద్దగా బాగోలేకపోయినప్పటికి.. భారత్ పిచ్‌లపై ఏమి చేశాడో మనమందరం చూశం. టోర్నీలో 3 సెంచరీలతో ఏకంగా 578 పరుగులు చేశాడు. అదే విధంగా వచ్చే ఐపీఎల్ సీజన్ ప్లేఆఫ్స్‌కు బెయిర్ స్టో కూడా అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో పంజాబ్ రవీంద్ర కోసం కచ్చితంగా ప్రయత్నిస్తోందని" చెప్పుకొచ్చాడు. వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న రవీంద్రకు టీ20ల్లో మాత్రం పెద్దగా రికార్డులు లేవు. 18 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... -
పాడు వైరస్.. తాతను తీసుకెళ్లిపోయింది: క్రికెటర్ భావోద్వేగం
చెన్నై: టీమిండియా టెస్టు ఓపెనర్ అభినవ్ ముకుంద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అభినవ్ ముకుంద్ తాత టీ. సుబ్బారావు(95) కరోనాతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అభినవ్ ముకుంద్ తన ట్విటర్లో పేర్కొన్నాడు. ''ఈరోజు నా జీవితంలో చీకటిరోజు. నాకు ఎంతో ఇష్టమైన మా తాత టీ. సుబ్బారావు ఈరోజు కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 95 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న మా తాతను పాడు వైరస్ మా తాతను తీసుకెళ్లిపోయింది. ఆయన మాతో ఉన్నన్నాళ్లు అందరం క్రమశిక్షణతో మెలిగేవాళ్లం.. నేడు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఓం శాంతి అంటూ భావోద్వేగంతో తెలిపాడు. కాగా కరోనా సెకండ్‌వేవ్‌లో చాలా మంది క్రికెటర్లు తమ ఆప్తులను కోల్పోతున్నారు. పియూష్ చావ్లా, ఆర్పీ సింగ్ తండ్రులు కరోనాతో మృతి చెందగా.. టీమిండియా మహిళా క్రికెటర్ల వేదా కృష్ణమూర్తి తన సోదరిని, తల్లిని కోల్పోగా.. మరో క్రికెటర్ ప్రియా పూనియా తల్లి కరోనా కాటుకు బలయ్యారు. ఇక తమిళనాడుకు చెందిన అభినవ్ ముకుంద్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున ఏడు టెస్టలాడిన ముకుంద్ 320 పరుగులు చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన ముకుంద్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. నాలుగేళ్ల క్రితమే టీమిండియాకు దూరమైన అభినవ్ దేశవాలీ టోర్నీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 145 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 10వేలకు పైగా పరుగులు సాధించాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 300 పరుగులు సాధించి తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం With great sadness, i would like to inform you all that i have lost my grandfather Mr. TK Subbarao to CoVid19. He was 95. A man known for his discipline and his exemplary routines,was otherwise hale and healthy till the virus took him away. Om Shanti! — Abhinav mukund (@mukundabhinav) May 20, 2021 -
నాది కూడా అభినవ్ వర్ణ వివక్ష స్టోరీనే
బెంగళూరు: మళ్లీ జాతి వివక్ష అంశం తీవ్రమైంది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని శ్వేత జాతి పోలీస్ అధికారి విచక్షణారహితంగా చంపిన నేపథ్యంలో ఆ దేశంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీనిపై ఇప్పటికే పలువురు క్రీడా దిగ్గజాలు విరుచుకుపడుతుండగా, గతంలో ఎవరైతే ఇలా వర్ణ వివక్షకు గురయ్యారో వారు ముందుకొస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ క్రికెటర్ దొడ్డా గణేశ్‌తో పాటు తమిళనాడుకు చెందిన టాపార్డర్ బ్యాట్స్‌మన్ అభివన్ ముకుంద్‌లు ఉన్నారు. దీనిపై ముందుగా అభినవ్ ముకుంద్ తన స్వరం వినిపించగా, అందుకు దొడ్డా గణేశ్ మద్దతుగా నిలిచాడు.(‘గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా?’) ‘నేను జాతి వివక్ష బారిన పడ్డా. కొంతమంది నన్ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో నాపై విమర్శలు చేశారు. నా వర్ణాన్ని కించపరుస్తూ అవహేళన చేశారు. వారిని నియంత్రణలో పెట్టడం అనేది మన చేతుల్లో ఉండదు. మనిషి రంగును బట్టి గుణం ఉండదు. అది అందానికి సంబంధించినది కాదు. ఎవరైతే ఇలా వివక్షకు గురయ్యారో వారంతా వారి వారి అనుభవాల్ని షేర్ చేసుకుంటే మంచిది’ అని తెలిపాడు. కాగా, ఆ సమయంలో ఎందుకు మాట్లాడలేదని ముకుంద్‌ను జర్నలిస్టు ప్రశ్నించగా, అది సరైన సమయం కాదనే తాను మాట్లాడలేదన్నాడు. 2017 శ్రీలంకతో వారి దేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలో ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో నేనేమీ మాట్లాడలేదు’ అని ముకుంద్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్ ఒక లేఖను సైతం అభినవ్ పోస్ట్ చేశాడు. తాను క్రికెటర్‌గా చాలా చోట్లకు తిరుగుతూ ఉండేవాడినని, ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో వర్ణ వివక్షకు గురైన విషయాన్ని తెలిపాడు. మనలోని స్వచ్ఛత అనేది రంగును బట్టి ఏమీ ఉండదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయాన్ని చెబుతున్నానన్నాడు. ఇకనైనా ఇలా వివక్ష వ్యాఖ్యలు చేసేవారి మైండ్ సెట్ మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. (రవిశాస్త్రి పోస్ట్‌కు రణ్వీర్ రిప్లై) నాది కూడా అభినవ్ స్టోరీనే అభివన్ ముకుంద్ పోస్ట్ చేసిన లేఖపై కర్ణాటకకు చెందిన భారత మాజీ పేసర్ దొడ్డా గణేశ్ స్పందించాడు. తాను కూడా అభినవ్ తరహాలోనే వర్ణ వివక్షకు గురైనట్లు తెలిపాడు. ‘అభినవ్ స్టోరీ నాకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసింది. నేను భారత్‌కు ఆడుతున్న సమయంలో ఎక్కువగా వర్ణ వివక్షకు గురయ్యా. దానికి ఒక భారత లెజండరీ క్రికెటరే సాక్ష్యం. ఇలా విమర్శించడం నన్ను ధృఢంగా చేసింది అలాగే దేశానికి ఆడటాన్ని కూడా దూరం చేయలేదు. నిజాయితీగా చెప్పాలంటే 90వ దశకంలో వర్ణ వివక్ష సీరియస్‌నెస్ గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పుడు మనం ఏమైనా చెప్పుకోవడానికి ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా లేదు. భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ ఇలా వర్ణ వివక్షకు గురి కాడనే ఆశిస్తున్నా’ అని దొడ్డా గణేశ్ తెలిపాడు. భారత్ తరఫున నాలుగు టెస్టులు, ఒక వన్డే మ్యాచ్‌ను గణేశ్ ఆడాడు. ఇక రంజీ ట్రోఫీ విషయానికొస్తే కర్ణాటక తరఫున 100పైగా మ్యాచ్‌లు ఆడిన గణేశ్.. 365 వికెట్లు సాధించాడు. 2007లో తన అంతర్జాతీయ కెరీర్‌కు గణేశ్ వీడ్కోలు చెప్పాడు. This story of @mukundabhinav, reminded me of the racial jibes I went through in my playing days. Only an Indian legend was witness to it. It only made me strong & didn’t deter me from playing for Ind & ovr 100 mts for Karnataka @StarSportsKan ಕಪ್ಪಗಿರೋರು ಮನುಷ್ಯರೇ. ಮೊದಲು ಮಾನವರಾಗಿ. pic.twitter.com/ZV8c8YPmpM— ದೊಡ್ಡ ಗಣೇಶ್ | Dodda Ganesh (@doddaganesha) June 3, 2020 -
నేటి నుంచి దులీప్ ట్రోఫీ సమరం
దిండిగుల్ (తమిళనాడు): భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018–19)కు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే దులీప్ ట్రోఫీతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ‘రెడ్’ తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ మ్యాచ్‌లన్నీ నాలుగు రోజులు... సెప్టెంబర్ 4నుంచి ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. ఇండియా ‘రెడ్’కు అభినవ్ ముకుంద్ సారథి కాగా... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్, ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో అభినవ్ ముకుంద్, పార్థివ్ పటేల్‌లు తాము ఆ స్థానాలకు అర్హులమే అని నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం. భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఆటకు దూరమవ డంతో... అతని స్థానంలో ఎంపికైన దినేశ్ కార్తీక్ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటే అతను సత్తా చాటక తప్పదు. వీళ్లతో పాటు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఫైజ్ ఫజల్, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, బాసిల్ థంపి, గుర్బాని, గణేశ్ సతీశ్, బి. సందీప్, ఎ. మిథున్, అంకిత్ రాజ్‌పుత్, జైదేవ్ ఉనాద్కట్‌లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఆంధ్ర క్రికెటర్లు శ్రీకర్ భరత్, అయ్యప్ప ఇండియా ‘బ్లూ’ జట్టుకు, పృథ్వీరాజ్ ‘రెడ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా... సాక్షి, విజయవాడ: ఆస్ట్రేలియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’లతో పాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు పాల్గొంటున్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ కూడా నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో నేడు, రేపు జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూలపాడులో జరిగే ఈ టోర్నీ ఫైనల్ ఈ నెల 29న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు జోండో కెప్టెన్ కాగా... ఆస్ట్రేలియాకు ట్రవిస్ హెడ్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ ‘ఎ’ జట్టుకు శ్రేయస్ అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. -
తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లా?
భారత క్రికెటర్ అభినవ్ ముకుంద్‌పై సోషల్ మీడియాలో కొంత మంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదం రేపింది. దీనిపై స్పందిస్తూ ముకుంద్... తన నలుపు రంగు కారణంగా బాధితుడిగా మారడం ఇది మొదటిసారి కాదని, కెరీర్ ఆసాంతం తనకు అలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు. ఈ విషయంలో ప్రజల ఆలోచన తీరు మారాలన్న ముకుంద్... అందం అంటే తెలుపు రంగులోనే లేదని అన్నాడు. భారత కెప్టెన్ కోహ్లి సహా పలువురు ప్రముఖులు ఈ విషయంలో ముకుంద్‌కు తమ మద్దతు ప్రకటించారు. -
వారిని సందర్భాన్ని బట్టి పరీక్షిస్తాం: కోహ్లి
కొలంబో: ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చివరి నిమిషంలో చోటు దక్కిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ అయిన మురళీ విజయ్ గాయం ఇంకా నయం కాలేకపోవడంతో శిఖర్ ధావన్ కు జట్టులో చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్ కూడా శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టులో ఉన్నాడు. దాంతో కేఎల్ రాహుల్ తో కలిసి ఆ ఇద్దరిలో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే దానిపై కొంతవరకూ సందిగ్ధత ఉంది. ఆ విషయంపై స్పందించిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆ ఇద్దర్నీ సందర్భాన్ని బట్టి రాహుల్ కు జతగా పంపిస్తామన్నాడు. ఆ ఇద్దర్నీ తుది జట్టులోకి తీసుకునే విషయం అప్పటి పరిస్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగినా ఒత్తిడిగా కాకుండా ఓ అవకాశంలా భావించాలని కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. 'ప్రతీ ఒక్క ఆటగాడు జాతీయ జట్టులోకి సత్తా చాటేందుకు ఆరాటపడటమనేది సర్వసాధారణం. ఆటగాళ్లను ఎంపిక తరువాత అందరికీ అవకాశం కల్పించడానికే యత్నిస్తాం. అది అప్పటి పరిస్థితిని బట్టే ఉంటుంది. మురళీ విజయ్ పూర్తిగా ఫిట్ గా లేడని ఆఖరి నిమిషంలో తెలిసింది. ఆటగాళ్ల గాయాలనేవి గేమ్ లో దురదృష్టపు భాగం. అభినవ్ ముకుంద్ చాలా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాడు. మరొకవైపు ఇక్కడ చివరిసారి శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. అదే సమయంలో చటేశ్వర పుజారా ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఓపెనింగ్ చేశాడు. ఇలా ప్రతీ ఒక్కరూ అందుబాటులో ఉన్నారు. దాంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆటగాళ్లను ఉపయోగించుకుంటాం'అని కోహ్లి పేర్కొన్నాడు. -
56 టెస్టుల తర్వాత కూడా అదే కథ
బెంగళూరు:దాదాపు ఐదున్నరేళ్ల తరువాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో అభినవ్ కు మరోసారి జట్టులో చోటు కల్పించగా డకౌట్ గా అవుటయ్యాడు. 2011లో జూలైలో ఇంగ్లండ్ తో నాటింగ్ హమ్లో జరిగిన టెస్టులో అభినవ్ చివరిసారి కన్పించాడు. ఆ తరువాత మళ్లీ ఇంతకాలానికి జట్టులోకి వచ్చాడు. అంటే ఈ కాలంలో భారత్ తరపున 56 టెస్టులను అభినవ్ మిస్సయ్యాడు. అయితే ఇంతటి సుదీర్ఘ కాలం తరువాత భారత్ క్రికెట్ జట్టులోకి వచ్చినా అతని ఆట తీరు మాత్రం మారలేదు. అప్పుడు ఇంగ్లండ్ తో ఆఖరిసారి ఆడిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన అభినవ్.. ఆ తరువాత ఆడుతున్న తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా డకౌట్ గానే వెనుదిరిగాడు. అప్పుడు గోల్డెన్ డక్ గా అభినవ్ పెవిలియన్ చేరితే, ఇప్పుడు ఎనిమిది బంతులను ఎదుర్కొని స్టార్క్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ఆనాటి రెండో ఇన్నింగ్స్ లో అభినవ్ మూడు పరుగులు మాత్రమే చేసి భారత జట్టులో స్థానం కోల్పోయాడు. మళ్లీ చోటు దక్కించుకోవడానికి ఐదేళ్లకు పైగా ఆగాల్సి వచ్చింది. ఒకవేళ ఈ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అభినవ్ రాణించకపోతే అతని కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉంది. -
విజయ్ అవుట్.. ముకుంద్, నాయర్ ఇన్
-
విజయ్ అవుట్.. ముకుంద్, నాయర్ ఇన్
బెంగళూరు: తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌కు దాదాపు ఐదున్నరేళ్ల విరామం తర్వాత భారత టెస్టు జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేశారు. తొలిటెస్టులో గాయపడ్డ ఓపెనర్ మురళీ విజయ్ను పక్కనబెట్టి, అతని స్థానంలో ముకుంద్‌ను తీసుకున్నారు. ఇక జయంత్ యాదవ్‌ను తప్పించి ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్‌గా ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. ఈ రెండు మార్పులు మినహా తొలి టెస్టులో ఆడిన ఆటగాళ్లు రెండో టెస్టులో బరిలో దిగారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోన్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లోకేష్ రాహుల్, ముకుంద్ బ్యాటింగ్‌కు దిగారు. పుణెలో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన ఘోరపరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పుంజుకుని విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. -
ముకుంద్‌కు మళ్లీ పిలుపు
పార్థివ్ స్థానంలో సాహా బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఐదున్నరేళ్ల క్రితం భారత్ తరఫున తన చివరి టెస్టు ఆడిన తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌కు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది. బంగ్లాదేశ్‌తో ఈనెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్‌లో జరిగే ఏకైక టెస్టు కోసం మంగళవారం ప్రకటించిన భారత జట్టులో ముకుంద్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్ కోసం సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ముకుంద్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. 2016–17 రంజీ సీజన్లో 4 సెంచరీలు సహా 849 పరుగులు చేసి అతను సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. విజయ్, లోకేశ్ రాహుల్ రూపంలో ప్రధాన ఓపెనర్లు కూడా జట్టులో ఉండటంతో ముకుంద్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నా... 27 ఏళ్ల వయసులో అతను జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. మరోవైపు ఊహించినట్లుగానే రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల తర్వాత గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. సాహా స్థానంలో వచ్చిన పార్థివ్ పటేల్ మిగిలిన మూడు టెస్టుల్లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పినట్లు సాహాకే మొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఇరానీ కప్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ చెలరేగి సాహా డబుల్ సెంచరీ కూడా చేయడం అతనికి కలిసొచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జట్టుతో పాటే ఉన్నా, మ్యాచ్ ఆడే అవకాశం దక్కని మనీశ్ పాండేని కూడా తప్పించారు. గాయాల నుంచి కోలుకున్న విజయ్, రహానే, జయంత్, హార్దిక్ పాండ్యాలను కూడా టెస్టు జట్టులోకి ఎంపిక చేయగా, ఇంకా కోలుకొని షమీ పేరును పరిశీలించలేదు. భారత జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, కరుణ్ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, ఇషాంత్, భువనేశ్వర్, మిశ్రా, ముకుంద్, పాండ్యా. ‘ఎ’ జట్టులో సిరాజ్, రాహుల్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఈనెల 16 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా జట్టు ముంబైలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో తలపడే భారత్ ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. హైదరాబాద్ పేసర్ సిరాజ్, హైదరాబాద్‌కే చెందిన సర్వీసెస్ బ్యాట్స్‌మన్ రాహుల్ సింగ్‌లకు స్థానం లభించింది. జట్టు వివరాలు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అఖిల్, ప్రియాంక్, శ్రేయస్, అంకిత్ బావ్నే, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, నదీమ్, గౌతమ్, కుల్దీప్ యాదవ్, నవదీప్, దిండా, సిరాజ్, రాహుల్ సింగ్, ఇంద్రజిత్. ఆరు గంటలు ఆలస్యంగా... భారత జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా హైడ్రామా నడిచింది. సుప్రీం కోర్టు కొత్తగా నియమించిన కమిటీ ఈ ప్రక్రియను సరైన పద్ధతిలో నిర్వహించాలని పట్టుదల కనబర్చడమే దానికి కారణం. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్వీనర్ హోదాలో ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయత్నించగా పరిపాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ అందుకు అనుమతించలేదు. అమితాబ్‌కు అర్హత లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సమావేశం ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తనకు తెలీదంటూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూడా సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్ హోటల్ బయట తచ్చాడుతూ కనిపించారు. చివరకు సాయంత్రం ఆరు గంటలకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్లి ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. బీసీసీఐలో ఈ తరహా గందరగోళానికి త్వరలోనే తెర పడితే బాగుంటుందని, ప్రతీ రోజూ చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిగా మారాయని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డారు. -
ముకుంద్, ఛటర్జీ సెంచరీలు
ఇండియా రెడ్ 344/3 దులీప్ ట్రోఫీ మ్యాచ్ గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ‘పింక్‌బాల్’ మ్యాచ్‌లో రెండో రోజు పరుగుల వరద పారింది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఇండియా రెడ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (212 బంతుల్లో 162 బ్యాటింగ్; 19 ఫోర్లు), సుదీప్ ఛటర్జీ (182 బంతుల్లో 114; 14 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 240 పరుగులు జోడించగా, యువరాజ్ (10) మళ్లీ విఫలమయ్యాడు. అంతకు ముందు 116/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌటైంది. -
భారత్ ‘ఎ’ 342/6
రాణించిన రాయుడు, ముకుంద్ వాయ్‌నాడ్ (కేరళ) : దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. అంబటి రాయుడు (81 బంతుల్లో 71; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), అభినవ్ ముకుంద్ (136 బంతుల్లో 72; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. అంకుష్ బైన్స్ (34 బ్యాటింగ్), అక్షర్ పటేల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లు జీవన్‌జ్యోత్ సింగ్ (92 బంతుల్లో 52; 7 ఫోర్లు), ముకుంద్ తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వన్‌డౌన్‌లో అపరాజిత్ (34) మెరుగ్గా ఆడాడు. షెల్డన్ జాక్సన్ (25) ఫర్వాలేదనిపించాడు. అంకుష్‌తో కలిసి 56 పరుగులు జోడించిన రాయుడు చివర్లో అవుటయ్యాడు. పిడిట్ 4, సొట్‌సోబ్ 2 వికెట్లు తీశారు.