భారత్ ‘ఎ’ 342/6 | India 'A' 342/6 | Sakshi
Sakshi News home page

భారత్ ‘ఎ’ 342/6

Published Thu, Aug 27 2015 12:44 AM | Last Updated on Fri, May 25 2018 7:45 PM

భారత్ ‘ఎ’ 342/6 - Sakshi

భారత్ ‘ఎ’ 342/6

రాణించిన రాయుడు, ముకుంద్
 
 వాయ్‌నాడ్ (కేరళ) : దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. అంబటి రాయుడు (81 బంతుల్లో 71; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), అభినవ్ ముకుంద్ (136 బంతుల్లో 72; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. అంకుష్ బైన్స్ (34 బ్యాటింగ్), అక్షర్ పటేల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఓపెనర్లు జీవన్‌జ్యోత్ సింగ్ (92 బంతుల్లో 52; 7 ఫోర్లు), ముకుంద్ తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వన్‌డౌన్‌లో అపరాజిత్ (34) మెరుగ్గా ఆడాడు. షెల్డన్ జాక్సన్ (25) ఫర్వాలేదనిపించాడు. అంకుష్‌తో కలిసి 56 పరుగులు జోడించిన రాయుడు చివర్లో అవుటయ్యాడు. పిడిట్ 4, సొట్‌సోబ్ 2 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement