తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లా?
భారత క్రికెటర్ అభినవ్ ముకుంద్‌పై సోషల్ మీడియాలో కొంత మంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదం రేపింది. దీనిపై స్పందిస్తూ ముకుంద్... తన నలుపు రంగు కారణంగా బాధితుడిగా మారడం ఇది మొదటిసారి కాదని, కెరీర్ ఆసాంతం తనకు అలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు. ఈ విషయంలో ప్రజల ఆలోచన తీరు మారాలన్న ముకుంద్... అందం అంటే తెలుపు రంగులోనే లేదని అన్నాడు. భారత కెప్టెన్ కోహ్లి సహా పలువురు ప్రముఖులు ఈ విషయంలో ముకుంద్‌కు తమ మద్దతు ప్రకటించారు.