IPL 2024: ఈసారి టైటిల్‌ మాదే అం‍టున్న సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌..! | IPL 2024: SRH Fans Feel This Time They Take Away The Trophy | Sakshi
Sakshi News home page

చాలాకాలం తర్వాత పటిష్టంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్‌.. ఈసారి కప్‌ మాదే అంటున్న ఫ్యాన్స్‌..!  

Published Wed, Dec 20 2023 8:49 PM | Last Updated on Thu, Dec 21 2023 9:36 AM

IPL 2024: SRH Fans Feel This Time They Take Away The Trophy - Sakshi

2013లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి 2016 సీజన్‌లో విజేతగా, 2018లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చాలాకాలం తర్వాత పటిష్టంగా కనిపిస్తుంది. లీగ్‌ ఆరంభ సీజన్లలో పర్వాలేదనిపించిన ఆరెంజ్‌ ఆర్మీ.. ఇటీవలి కాలంలో అధఃపాతాళానికి పడిపోయి సొంత అభిమానుల ఆగ్రహానికి కూడా గురైంది. గడిచిన మూడు సీజన్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రదర్శన ఎంత దారుణంగా ఉండిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2021లో ఆఖరి స్థానం, 2022లో 10లో ఎనిమిదో స్థానం, గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 2024 సీజన్‌కు ముందు దాదాపుగా దుఖానం సర్దేసుకునే పరిస్థితికి వచ్చింది. 

అయితే తాజాగా జరిగిన వేలంలో యాజమాన్యం అవసరానికి తగ్గట్టుగా కొందరు ఆటగాళ్లను (పాట్‌ కమిన్స్‌, ట్రవిస్‌ హెడ్‌, హసరంగ, జయదేవ్‌ ఉనద్కత్‌) కొనుగోలు చేయడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ప్రసుత్త జట్టుతో టైటిల్‌ కచ్చితంగా నెగ్గగలమని ఫ్యాన్స్‌ ధీమాకు వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. తుది జట్టులో ఎవరెవరిని ఆడించాలో ఇప్పటినుంచే డిసైడ్‌ చేస్తున్నారు.  

ఇప్పటికే రిటెయిన్‌ చేసుకున్న జట్టులో మార్క్రమ్‌, క్లాసెస్‌ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లు ఉండగా.. కొత్తగా వచ్చిన కమిన్స్, హెడ్‌లతో విదేశీ ఆటగాళ్ల కోటా పరిపూర్ణమవుతుందని ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు. దేశీయ ఆటగాళ్ల విషయానికొస్తే.. భువనేశ్వర్‌ కుమార్‌​, మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ, నటరాజన్‌, అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి ఆటగాళ్లు ఉండనే ఉన్నారు. స్వదేశీ, విదేశీ స్టార్ల కలయికతో ఈ సారి ట్రోఫీ మాదే అంటూ ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే సంకలు గుద్దుకుంటున్నారు. 

ఐపీఎల్‌ 2024 కోసం సన్‌రైజర్స్‌ జట్టు:

అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు
రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు
ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు (కెప్టెన్‌)
గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు
మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు
ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు
అన్మోల్‌ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు
ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు
షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు
నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు
అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు
మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు
వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు
సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు
పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు
భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు
టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు
వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు
మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు
ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు
ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు
జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు
ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు
ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement