దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలకు అమ్ముడుపోయారు. స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేయగా.. కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.
కాగా మొత్తం 77 స్ధానాల కోసం వేలం జరగగా.. ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇక ఈ వేలంలో ఆసీస్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిస్తే.. మరో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ మాత్రం ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ. 2 కోట్ల వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఇక స్మిత్‌తో పాటు ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన టాప్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే:
స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు)
వాండర్ డసెన్ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్ ఇంగ్లిస్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమీ ఓవర్టన్ (కనీస ధర రూ.2 కోట్లు)
బెన్ డకెట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమ్స్ విన్స్ (కనీస ధర రూ.2 కోట్లు)
సీన్ అబాట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్ హేజిల్ వుడ్ (కనీస ధర రూ.2 కోట్లు)
ఆదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేసన్ హోల్డర్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
కొలీన్ మున్రో (కనీస ధర రూ.1.50 కోట్లు)
టిమ్ సౌథీ (కనీస ధర రూ.1.50 కోట్లు)
క్రిస్ జొర్డాన్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
డానియల్ సామ్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
ఫిలిప్ సాల్ట్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
జేమ్స్ నీషమ్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
టైమల్ మిల్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు
చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment