PC: IPL.com
ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. అతడితో పాటు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా భారీ మొత్తం దక్కించుకున్నాడు. రూ.20.50 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగొలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ మొత్తం ఫ్రాంచైజీలు వెచ్చించడాన్ని రైనా తప్పుబట్టాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి టీమిండియా స్టార్లు విదేశీ ఆటగాళ్ల కంటే తక్కువ తీసుకుంటున్నారని అతడు అన్నాడు.
అదే విధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం వేలంలోకి వస్తే రూ. 42 కోట్లకు అమ్ముడుపోతాడని ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. అయితే అందుకు ఐపీఎల్ రూల్స్ సవరించాల్సి ఉంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు.
"ఐపీఎల్ రూల్స్‌లో కొన్ని మార్పులు చేయాలి. ప్రతీ ఫ్రాంచైజీ పర్స్‌ను రూ.200 కోట్లకు పెంచాలి. అందులో భారత ఆటగాళ్ల కోసం రూ.150 కోట్లు వెచ్చించేలా కండీషన్ పెట్టాలి. మిగిలిన 50 కోట్ల రూపాయలను విదేశీ క్రికెటర్ల కోసం ఉంచాలి. అప్పుడు కోహ్లి వేలంలో వస్తే 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడని" జియో సినిమాతో చోప్రా పేర్కొన్నాడు.
రైనా మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత స్టార్లు జస్ప్రీత్ బుమ్రాకు రూ.12 కోట్లు, మహ్మద్ షమీకి రూ.5 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ధోని కూడా కేవలం రూ.12 కోట్లకే సీఎస్‌కే ఆడుతున్నాడు. 8 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడని ఆటగాడికి దాదాపు రూ.25 కోట్లు ఇచ్చారు. అది సరైన నిర్ణయం కాదని అన్నాడు.
చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment