
Courtesy: IPL
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. ముందుగా ప్రచారం జరిగిన విధంగా గుజరాత్ టైటన్స్ హార్దిక్ పాండ్యాను వదిలేయలేదు.
జీటీ యాజమాన్యం కెప్టెన్‌గా హార్ధిక్‌నే మరోసారి కొనసాగించింది. టైటన్స్ మొత్తంగా ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలించుకుని 18 మందిని కొనసాగించింది. టైటన్స్ వదిలించుకున్న ఆటగాళ్ల జాబితాలో గత సీజన్ రింకూ సింగ్ బాధితుడు యశ్ దయాల్ తదితరులు ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే..
- యశ్ దయాల్
- కేఎస్ భరత్
- శివమ్ మావి
- ఉర్విల్ పటేల్
- ప్రదీప్ సాంగ్వాన్
- ఓడియన్ స్మిత్
- అల్జరీ జోసఫ్
- దసున్ షనక
గుజరాత్ టైటాన్స్ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే..
- హార్ధిక్ పాండ్యా (కెప్టెన్)
- డేవిడ్ మిల్లర్
- శుభ్‌మన్ గిల్
- మాథ్యూ వేడ్
- వృద్ధిమాన్ సాహా
- కేన్ విలియమ్సన్
- అభినవ్ మనోహర్
- సాయి సుదర్శన్
- దర్శన్ నల్కండే
- విజయ్ శంకర్
- జయంత్ యాదవ్
- రాహుల్ తెవాటియా
- మొహమ్మద్ షమీ
- నూర్ అహ్మద్
- సాయికిషోర్
- రషీద్ ఖాన్
- జాషువ లిటిల్
- మోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment