భజ్జీ- కోహ్లి (PC: IPL)
'Virat Kohli's greatness reduced...': అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ‘రన్‌మెషీన్’ అన్న బిరుదును సార్థకం చేసుకున్న ఘనత టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సొంతం. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇప్పటి వరకు ఏడు సెంచరీలు బాదాడు.
రాజ్‌కోట్, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఒక్కోసారి శతక్కొట్టిన కోహ్లి.. సొంతమైదానం బెంగళూరులో ఏకంగా నాలుగుసార్లు సెంచరీ మార్కు అందుకున్నాడు. అయితే, చెన్నైలోని చెపాక్(ఎంఏ చిదంబరం) స్టేడియంలో మాత్రం ఈ ఆర్సీబీ ప్లేయర్ ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు.
అక్కడ అతడి రికార్డు గొప్పగా ఏమీలేదు
స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై కోహ్లి బ్యాటింగ్ సగటు 30 కావడం గమనార్హం. ఇక ఇదే వేదికపై ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో తలపడనుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. విరాట్ కోహ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘చెపాక్‌లో ఓవరాల్‌గా విరాట్ ప్రదర్శన గమనిస్తే.. అతడి బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీలేదని తేలిపోయింది.
నిజం చెప్పాలంటే ఇది కఠినమైన పిచ్. టెన్నిస్ బాల్ మాదిరి బౌన్స్ అయ్యే బాల్‌ను ఎదుర్కోవడం బ్యాటర్లకు.. ముఖ్యంగా ఓపెనర్లకు కత్తిమీద సాము లాంటిదే. మరోవైపు సీఎస్‌కేలో రవీంద్ర జడేజా మాదిరి స్టంప్ టూ స్టంప్ బౌల్ చేసే గొప్ప స్పిన్నర్ ఉన్నాడు.
అక్కడ చిన్నస్వామి మాదిరి సీన్ ఉండదు
బంతి తిరగడం మొదలుపెడితే అతడిని ఎదుర్కోవడం కష్టమైపోతుంది. అయితే, కోహ్లి గనుక పూర్తిస్థాయిలో సిద్ధమై.. 20 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయాలని పట్టుదలగా నిలబడితే కచ్చితంగా బౌలర్లకు చుక్కలు చూపించగలడు.
కానీ చిన్నస్వామి(బెంగళూరు) స్టేడియం మాదిరి.. ఇక్కడ మాత్రం సెంచరీలు బాదడం సులువు కాదు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా కోహ్లి 2016 మాదిరి ఈసారి కూడా విజృంభిస్తేనే ఆర్సీబీ ముందుక వెళ్లగలదని.. వాళ్లు కప్ కొడతారో లేదో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టమని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు.. అయినా
2019లో 16 మ్యాచ్‌లలో కలిపి కోహ్లి ఏకంగా 973 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు ఫిఫ్టీలు ఉన్నాయి. ఒక ఐపీఎల్ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అయితే, ఆ ఏడాది ఆర్సీబీ ఫైనల్‌కు వెళ్లినా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే.
చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్
IPL 2024: విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment