వారెవ్వా మయాంక్‌.. టీమిండియాకు మరో శ్రీనాథ్‌ దొరికేశాడు | Mayank Yadav Stars As Lucknow Beat Bengaluru By 28 Runs | Sakshi
Sakshi News home page

#Mayank Yadav: వారెవ్వా మయాంక్‌.. నయా పేస్‌ సంచలనం! మరో శ్రీనాథ్‌ దొరికేశాడు

Published Tue, Apr 2 2024 11:34 PM | Last Updated on Wed, Apr 3 2024 9:44 AM

Mayank Yadav Stars As Lucknow Beat Bengaluru By 28 Runs - Sakshi

ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ యవ పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ మరోసారి నిప్పులు చేరిగాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మయాంక్‌ యాదవ్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

మయాంక్‌ తన పేస్‌ బౌలింగ్‌తో ఆర్సీబీ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. 22 ఏళ్ల కుర్రాడి బౌలింగ్‌కు మాక్స్‌వెల్‌ లాంటి వరల్డ్‌క్లాస్‌ బ్యాటరే వణికిపోయాడు. అంతేకాకుండా గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ సీజన్‌లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు.

అదే విధంగా ఆర్సీబీ బ్యాటర్‌ గ్రీన్‌ను మయాంక్‌ అద్బుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇది మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. యాదవ్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్‌ సంచలనంపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

భారత క్రికెట్‌కు మరో జవగల్ శ్రీనాథ్‌ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైటర్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ అయిన మయాంక్‌ యాదవ్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే కచ్చితంగా అతి త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 28 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది.

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. లక్నో యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ 3 వికెట్లతో ఆర్సీబీని దెబ్బతీశాడు. అతడితో పాటు నవీన్‌ ఉల్‌ హక్‌ రెండు,యశ్‌ ఠాకూర్‌, స్టోయినిష్‌, సిద్దార్డ్‌ తలా వికెట్‌ పడగొట్టారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన మహిపాల్‌ లామ్రోర్‌(33) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అంతకముం‍దు బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో డికాక్‌ 81 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్‌ పూరన్‌ ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement