Virat Kohli: ఇప్పటికీ అదే ఫీలింగ్‌.. 2 నెలల తర్వాత ఇలా! | Sakshi
Sakshi News home page

Virat Kohli: బెంగళూరు చేరుకున్న కోహ్లి.. 2 నెలల తర్వాత ఇప్పుడిలా! వీడియో

Published Mon, Mar 18 2024 6:54 PM

Ive Been Into Normalcy For 2 Months Virat Kohli joins RCB camp for IPL 2024 - Sakshi

Virat Kohli joins RCB camp for IPL 2024: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులు సంతోషాల్లో మునిగితేలుతున్నారు. వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ విజేతగా నిలిచిన ఆర్సీబీ మహిళా జట్టు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ నెట్టింట సందడి చేస్తున్నారు.

వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా మరో వీడియోను వదిలింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ. జట్టు ముఖచిత్రం, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి బెంగళూరుకు చేరుకున్న దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. కాగా దాదాపు రెండు నెలల తర్వాత కింగ్‌ కోహ్లి రీఎంట్రీకి సిద్ధంకావడం విశేషం.

సంతోషంగా ఉంది
‘‘ఇక్కడికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఐపీఎల్‌ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. బెంగళూరులో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అవే భావోద్వేగాలు.. అవే అనుభూతులు.. 

దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ పాత జీవితంలోకి తిరిగి వచ్చినట్లుంది. నా లాగే అభిమానులంతా కూడా ఆసక్తిగా.. ఆతురతగా ఐపీఎల్‌ కోసం ఎదురుచూస్తున్నారనే అనుకుంటున్నా’’ అని విరాట్‌ కోహ్లి ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. 

కాగా ఆదివారం జరిగిన వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో ఆర్సీబీ జట్టు చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. పదహారేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. కప్‌ కొట్టాలన్న ఫ్రాంఛైజీ కల నెరవేరడంతో కోహ్లితో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు మస్త్‌ ఖుషీ అయ్యారు.

కుటుంబంతో రెండు నెలలు
ఈ క్రమంలో కోహ్లి.. వుమెన్‌టీమ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నాడు. ఇదిలా ఉంటే... వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన ఈ రన్‌మెషీన్‌.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో తమకు రెండో సంతానంగా.. ఫిబ్రవరి 15న కుమారుడు జన్మించాడని కోహ్లి దంపతులు తెలియజేశారు. చిన్నారికి అకాయ్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సుమారు రెండు నెలలుగా కుటుంబానికే సమయం కేటాయించిన కోహ్లి తిరిగి మైదానంలో దిగేందుకు సమాయత్తమవుతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024లో కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే. 14 ఇన్నింగ్స్‌లో కలిపి 639 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 6 అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది కోహ్లి అత్యధిక స్కోరు 101 నాటౌట్‌. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.

చదవండి: Hardik Pandya: నా కెప్టెన్సీలో ఆడటానికి రోహిత్‌కు ఇబ్బంది ఎందుకు?.. నిజానికి..

Advertisement
Advertisement