►డబ్ల్యూపీఎల్-2024 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది.
114 పరుగుల లక్ష్య ఛేదన.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
114 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్‌లో సోఫీ డివైన్ (32) ఔటైంది. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 53/1గా ఉంది. స్మృతి మంధన (20), ఎల్లిస్ పెర్రీ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది.
114 పరుగుల స్వల్ప లక్ష్యం.. ఆచితూచి ఆడుతున్న ఆర్సీబీ
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. స్మృతి మంధన 12, సోఫీ డివైన్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఆర్సీబీతో ఫైనల్.. 113 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ
ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్‌కే చేతులెత్తేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్
6 ఓవర్లలో 61 పరుగులు చేసి వికెట్లు కోల్పోని ఢిల్లీ క్యాపిటల్స్.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలింది. సోఫీ మోలినెక్స్ (3-0-14-3), శ్రేయాంక పాటిల్ (3-0-10-2), ఆశా శోభన (2-0-9-2) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఢిల్లీ ఇన్నింగ్స్ కుప్పకూలే దిశగా సాగుతుంది. 15 ఓవర్లలో ఆ జట్టు స్కోర్ 90/7గా ఉంది. అరుంధతి రెడ్డి (2), రాధా యాదవ్ (2) క్రీజ్‌లో ఉన్నారు.
మాయ చేసిన సోఫీ మోలినెక్స్..ఒకే ఓవర్‌లో 3 వికెట్లు
ఎనిమిదో ఓవర్‌లో ఆర్సీబీ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ మాయ చేసింది. ఈ ఓవర్లో ఆమె ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ నడ్డి విరిచింది. ఆ ఓవర్ల అనంతరం 61/0గా ఉన్న ఢిల్లీ స్కోర్ సోఫీ దెబ్బకు ఒక్క సారిగా పడిపోయింది. తొలి బంతికి షఫాలీ వర్మను (44) ఔట్ చేసిన సోఫీ.. మూడో బంతికి రోడ్రిగెజ్‌ను (0), నాలుగో బంతికి అలైస్ క్యాప్సీ (0) పెవిలియన్‌కు పంపింది. 9 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 69/3గా ఉంది. లాన్నింగ్ (20), మారిజన్ కాప్ (3) క్రీజ్‌లో ఉన్నారు.
విధ్వంసం సృష్టిస్తున్న షఫాలీ వర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. షఫాలీ కేవలం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి అజేయంగా ఉంది. షఫాలీకి మెగ్ లాన్నింగ్ (15 బంతుల్లో 17; 3 ఫోర్లు) సహకరిస్తుంది. 6 ఓవర్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 61/0గా ఉంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరిన ఢిల్లీ ఈ సారి టైటిల్‌పై ధీమాగా ఉండగా.. తొలి టైటిల్ కోసం ఆర్సీబీ ఉవ్విళ్లూరుతుంది.
తుది జట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లాన్నింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్‌కీపర్), శిఖా పాండే, మిన్ను మణి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుక సింగ్
Comments
Please login to add a commentAdd a comment