PC:IPL.com
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఓపెనర్‌గా వచ్చిన బట్లర్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. రాజస్తాన్ విజయానికి కేవలం ఒక్క పరుగు కావల్సిన నేపథ్యంలో బట్లర్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఇదే సిక్స్‌తో తన సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 58 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
బట్లర్‌కు ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ క్రిస్ గేల్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్ధానంలో కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్‌తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అదరగొట్టాడు.
4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷
— IndianPremierLeague (@IPL) April 6, 2024
And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪
Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN
Comments
Please login to add a commentAdd a comment