రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు బిగ్ షాక్‌.. స్వ‌దేశానికి వెళ్లిపోయిన బ‌ట్ల‌ర్‌ | Huge Setback For Rajasthan Royals As Jos Buttler Leaves IPL 2024 Midway | Sakshi
Sakshi News home page

IPL 2024: రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు బిగ్ షాక్‌.. స్వ‌దేశానికి వెళ్లిపోయిన బ‌ట్ల‌ర్‌

Published Mon, May 13 2024 9:08 PM | Last Updated on Tue, May 14 2024 8:55 AM

Huge Setback For Rajasthan Royals As Jos Buttler Leaves IPL 2024 Midway

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌కు ముందు రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్‌, ఇంగ్లండ్ ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్‌ ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. 

మ‌రి కొన్ని రోజుల్లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బ‌ట్ల‌ర్ స్వ‌దేశానికి ప‌య‌న‌మ‌య్యాడు. ఈ పొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌న్న‌హాకాల్లో భాగంగా ఇంగ్లండ్ స్వ‌దేశంలో పాకిస్తాన్‌తో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. 

ఈ సిరీస్ మే 22న ప్రారంభం కానుంది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో భాగ‌మైన ఆట‌గాళ్లు పాకిస్తాన్ సిరీస్ కంటే ముందే స్వదేశానికి రావాల్సి ఉంటుంద‌ని ఐపీఎల్ ప్రారంభంలోనే త‌మ ఆట‌గాళ్ల‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే జోస్ బ‌ట్ల‌ర్ ఇంగ్లండ్‌కు బ‌య‌లు దేరాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఫ్రాంచైజీ వెల్ల‌డించింది. 

త‌మ క్యాంప్‌ను బ‌ట్ల‌ర్ వీడి వెళ్తున్న వీడియోను రాజ‌స్తాన్ ఎక్స్‌లో షేర్ చేసింది. బ‌ట్ల‌ర్‌తో పాటు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఇంగ్లండ్ ఆట‌గాళ్లు విల్ జాక్స్‌, రీస్ టాప్లీ సైతం ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యారు. విల్ జాక్స్‌, రీస్ టాప్లీ బ‌ట్ల‌ర్‌తో పాటు ఇంగ్లండ్‌కు వెళ్లిపోయారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement