![Faf du Plessis Hit No-look Six, Harshit Rana Gets His Wicket Next Ball - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/29/faf.gif.webp?itok=E93Zg87p)
PC:IPL.com
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లో డుప్లెసిస్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో ఓ చెత్త షాట్ ఆడి డుప్లెసిస్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతి హాఫ్ కట్టర్‌గా సంధించాడు. కానీ డుప్లెసిస్ మాత్రం హాఫ్ సైడ్ వెళ్లి స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్.. ఈజీ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Sitaraman (@Sitaraman112971) March 29, 2024
Comments
Please login to add a commentAdd a comment