విరాట్ కోహ్లి
Virat Kohli On Mentor Who Inspired Him To Don India Jersey: ‘‘కొంత మందికి ఎల్లప్పుడూ ఆటే ప్రాధాన్యం. నేను ఆట మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి నాపై నమ్మకం ఉంచిన వాళ్ల పట్ల కృతజ్ఞతా భావం చాటుకోవడం ముఖ్యం. నేను ఎల్లప్పుడూ రాజ్‌కుమార్ సర్‌కు రుణపడి ఉంటాను. ఆయన నాకు కేవలం కోచ్ మాత్రమే కాదు.. నాకు మార్గదర్శనం చేసిన మెంటార్ కూడా!
నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎల్లవేళలా ఆయన నాకు మద్దతుగా నిలిచారు. క్రికెటర్ కావాలనే పెద్ద కలగన్న పిల్లాడిగా ఉన్న నాపై ఆయన నమ్మకం ఉంచారు. ఆయన ప్రోత్సాహమే 15 ఏళ్ల క్రితం నేను ఇండియన్ జెర్సీ వేసుకునే దిశగా ముందడుగు వేసేందుకు ఊతం ఇచ్చింది.
నా కలను మీ కలగా భావించారు. ఎన్నెన్నో సలహాలు, సూచనలు, బ్యాటింగ్‌లో మెళకువలు.. డీలా పడినపుడు వెన్నుతట్టి ప్రోత్సహించడం.. ఇన్ని చేసిన మీకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి థాంక్యూ నోట్ షేర్ చేశాడు.
తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మతో ఉన్న ఫొటో షేర్ చేసిన కోహ్లి.. ఆయన పట్ల కృతజ్ఞతా భావం చాటుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఓ బ్రాండ్ ప్రమోషన్ సందర్భంగా తన కోచ్ స్టోరీ ఇది అంటూ ఈ మేరకు రన్‌మెషీన్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఓనమాలు నేర్పిన గురువు
కాగా కోహ్లికి క్రికెట్‌లో ఓనమాలు నేర్పిన గురువు రాజ్‌కుమార్. అతడి ప్రోత్సాహంతో తన కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసిన విరాట్.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్త్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. టీమిండియా ముఖచిత్రంగా మారి జట్టును ముందుండి నడిపించి బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు.
2008లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇప్పటికే 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ పరుగుల యంత్రం సమకాలీనుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
రికార్డుల రారాజు
ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించి రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు. ఇప్పటికే కెరీర్‌లో శిఖరాగ్రస్థాయికి చేరుకున్న కోహ్లి.. అందుకు బీజం పడిన చోటును, తను జీరోగా ఉన్న సమయంలో వెన్నుతట్టి ప్రోత్సహించిన గురువును ఎన్నడూ మరువలేదు. సందర్భానుసారం రాజ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటూనే ఉన్నాడు.
ఇక ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీసు చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన రాజ్‌కుమార్ కాళ్లకు నమస్కరించి సముచిత గౌరవం ఇచ్చాడు. తాజాగా మరో పోస్టుతో కృతజ్ఞతలు తెలుపుకొంటూ తన మనసులో ఆయన స్థానం గురించి చెప్పుకొచ్చాడు.
చదవండి: ధోనిని అలా చూడలేకపోయా.. నా హృదయం ముక్కలైంది! వైరల్ వీడియో
MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్
ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ!
Comments
Please login to add a commentAdd a comment