Rajkumar Sharma
-
పెద్ద కలగన్న పిల్లాడిగా ఉన్న నాపై నమ్మకం ఉంచారు: కోహ్లి భావోద్వేగ పోస్ట్
Virat Kohli On Mentor Who Inspired Him To Don India Jersey: ‘‘కొంత మందికి ఎల్లప్పుడూ ఆటే ప్రాధాన్యం. నేను ఆట మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి నాపై నమ్మకం ఉంచిన వాళ్ల పట్ల కృతజ్ఞతా భావం చాటుకోవడం ముఖ్యం. నేను ఎల్లప్పుడూ రాజ్‌కుమార్ సర్‌కు రుణపడి ఉంటాను. ఆయన నాకు కేవలం కోచ్ మాత్రమే కాదు.. నాకు మార్గదర్శనం చేసిన మెంటార్ కూడా! నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎల్లవేళలా ఆయన నాకు మద్దతుగా నిలిచారు. క్రికెటర్ కావాలనే పెద్ద కలగన్న పిల్లాడిగా ఉన్న నాపై ఆయన నమ్మకం ఉంచారు. ఆయన ప్రోత్సాహమే 15 ఏళ్ల క్రితం నేను ఇండియన్ జెర్సీ వేసుకునే దిశగా ముందడుగు వేసేందుకు ఊతం ఇచ్చింది. నా కలను మీ కలగా భావించారు. ఎన్నెన్నో సలహాలు, సూచనలు, బ్యాటింగ్‌లో మెళకువలు.. డీలా పడినపుడు వెన్నుతట్టి ప్రోత్సహించడం.. ఇన్ని చేసిన మీకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి థాంక్యూ నోట్ షేర్ చేశాడు. తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మతో ఉన్న ఫొటో షేర్ చేసిన కోహ్లి.. ఆయన పట్ల కృతజ్ఞతా భావం చాటుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఓ బ్రాండ్ ప్రమోషన్ సందర్భంగా తన కోచ్ స్టోరీ ఇది అంటూ ఈ మేరకు రన్‌మెషీన్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఓనమాలు నేర్పిన గురువు కాగా కోహ్లికి క్రికెట్లో ఓనమాలు నేర్పిన గురువు రాజ్‌కుమార్. అతడి ప్రోత్సాహంతో తన కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసిన విరాట్.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్త్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. టీమిండియా ముఖచిత్రంగా మారి జట్టును ముందుండి నడిపించి బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. 2008లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటికే 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ పరుగుల యంత్రం సమకాలీనుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రికార్డుల రారాజు ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించి రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు. ఇప్పటికే కెరీర్లో శిఖరాగ్రస్థాయికి చేరుకున్న కోహ్లి.. అందుకు బీజం పడిన చోటును, తను జీరోగా ఉన్న సమయంలో వెన్నుతట్టి ప్రోత్సహించిన గురువును ఎన్నడూ మరువలేదు. సందర్భానుసారం రాజ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటూనే ఉన్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీసు చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన రాజ్‌కుమార్ కాళ్లకు నమస్కరించి సముచిత గౌరవం ఇచ్చాడు. తాజాగా మరో పోస్టుతో కృతజ్ఞతలు తెలుపుకొంటూ తన మనసులో ఆయన స్థానం గురించి చెప్పుకొచ్చాడు. చదవండి: ధోనిని అలా చూడలేకపోయా.. నా హృదయం ముక్కలైంది! వైరల్ వీడియో MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
IPL 2022: గొప్ప క్రికెటర్.. గొప్ప కెప్టెన్ అవుతాడన్న నమ్మకం లేదు.. కానీ
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో చోటుచేసుకున్న మార్పు గురించి ఢిల్లీ రంజీ జట్టు మాజీ ఆటగాడు రాజ్‌కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవీంద్ర జడేజా అత్యుత్తమ ఆల్‌రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే గొప్ప ఆటగాడు గొప్ప కెప్టెన్ అవ్వాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా మెగా టోర్నీ ప్రారంభానికి సరిగ్గా రెండ్రోజుల ముందు సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సీఎస్కే గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ధోని స్థానంలో రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ.. ‘‘రవీంద్ర జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే, కెప్టెన్‌గా అతడికి ఎక్కువ అనుభవం లేదు. నిజం చెప్పాలంటే.. ఓ మంచి ఆటగాడు.. మంచి కెప్టెన్ అవుతాడని కచ్చితంగా చెప్పలేం. అంతేకాదు గొప్ప కెప్టెన్ ఒక్కోసారి మంచి ప్లేయర్ కూడా కాకపోవచ్చు. అయితే, అతడికి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కాబట్టి టీమ్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో కనీస అవగాహన ఉండటం సహజం. అంతేగాక ఎంఎస్ ధోని జట్టులో ఉండనే ఉన్నాడు. జడేజాకు అతడు మార్గనిర్దేశనం చేస్తాడు’’ అని చెప్పుకొచ్చారు. కాగా మార్చి 26న డిపెండింగ్ చాంపియన్ సీఎస్కే- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. కెప్టెన్లుగా జడేజా- శ్రేయస్ అయ్యర్ మొదటి మ్యాచ్‌లో తలపడబోతున్నారు. చదవండి: World Cup 2022: వర్షం పడితే.... నేరుగా సెమీస్‌లోకి భారత్.. లేదంటే కష్టమే?! Passing the rein! 🧊➡️🔥 Watch the full 📹 👉 https://t.co/vS9BSJ01er#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja pic.twitter.com/HwcyHSSaUS — Chennai Super Kings (@ChennaiIPL) March 25, 2022 -
హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ నిప్పులు చెరిగారు. హార్దిక్ మాటల్లో పరిపక్వత కనిపించడం లేదని.. రోజుకో మాట మారుస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం పాండ్యా బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' టి20 ప్రపంచకప్ 2021 సమయానికి నేను 100 శాతం ఫిట్‌గా లేను. ఒక బ్యాటర్‌గా మాత్రమే నన్ను జట్టులోకి ఎంపిక చేశారు. కానీ టోర్నీ మధ్యలో ఆల్‌రౌండర్ ట్యాగ్‌తో బౌలింగ్ చేయమని చాలెంజ్ విసిరారు. బౌలింగ్ చేస్తే గాయం తిరగబెడుతుందని తెలుసు.. కానీ అప్పటికి తొలి మ్యాచ్‌లోనే బౌలింగ్‌కు దిగా. కానీ మంచి ప్రదర్శన చేయలేక.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అయ్యా. ఇందులో నా తప్పేముంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ranji Trophy 2022: పుజారా, రహానేలకు గంగూలీ పరోక్ష హెచ్చరిక పాండ్యా ప్రకటన క్రికెట్ వర్గాలతో పాటు ఇంటర్నెట్ను షేక్ చేసింది. పలువురు మాజీ ఆటగాళ్లు సైతం పాండ్యా వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఆల్‌రౌండర్ ట్యాగ్ ఇప్పటికైనా తీసేయండి అంటూ పేర్కొన్నారు. ఇదే అంశంపై కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడాడు. '' హార్దిక్‌కు ఫిట్నెస్ లేకపోయినప్పటికి.. అతనిపై నమ్మకంతో టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు మాత్రం తన తప్పు లేనట్లు మాట్లాడుతున్న హార్దిక్ పరిపక్వత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వాస్తవానికి అతను సెలెక్టర్లకు, మేనేజ్మెంట్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అతని వ్యాఖ్యలు అర్థరహితం.'' అంటూ పేర్కొన్నాడు. హార్ధిక్ పాండ్యా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని మరో మాజీ స్పిన్నర్ నిఖిల్ చోప్రా తెలిపాడు. ''హార్దిక్ పాండ్యా విషయంలో సెలెక్టర్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే క్లారిటీ ఇచ్చారు. అతన్ని కేవలం బ్యాటర్‌గానే తీసుకున్నామని.. అవసరం వచ్చినప్పుడు బౌలింగ్ వేస్తాడని తెలిపారు. కానీ హార్దిక్ మాత్రం అనవసర స్టేట్మెంట్స్ ఇస్తూ తనను తాను బ్యాడ్ చేసుకుంటున్నాడు'' అంటూ తెలిపాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నుంచి అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి మారిన హార్దిక్ పాండ్యా ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతనితో పాటు రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్‌ను కూడా ఎంపిక చేసింది. హార్దిక్, రషీద్‌లకు చెరో రూ.15 కోట్లు.. శుబ్‌మన్ గిల్‌కు రూ. 8 కోట్లు వెచ్చించింది. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగావేలం జరగనుంది. చదవండి: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! -
"కోహ్లి ఫోన్ స్విచ్ఛాఫ్.. ఏమైందో నాకు తెలియదు"
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిను తొలగించడంపై చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అసక్తికర వాఖ్యలు చేశాడు. బీసీసీఐ, సీనియర్ సెలక్షన్ కమిటీ పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకోలేదని అతడు అభిప్రాయపడ్డాడు. “నేను విరాట్ కోహ్లితో ఇంకా మాట్లాడలేదు. అతడి ఫోన్ స్విఛ్చాఫ్‌లో ఉంది. టీ20 కెప్టెన్సీనుంచి తన ఇష్టంతోనే తప్పుకున్నాడు. సెలెక్టర్లు వెంటనే అతనిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగమని చెప్పవలిసింది. లేదంటే టీ20, వన్డే ఫార్మాట్లో కొన్నాళ్లు కోనసాగమని కోరవలిసింది. ఇలా ఒక్క సారిగా అతడిని కెప్టెన్‌గా తప్పించడం చాలా అన్యాయం "అని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. కాగా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని కోహ్లిని బీసీసీఐ కోరిందని గంగూలీ చేసిన వ్యాఖ్యలను రాజ్‌కుమార్ విభేదించాడు. "ప్రపంచకప్‌కు ముందు టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని కోహ్లిని కోరినట్లు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను నేను చదివాను.నాకు తెలిసినట్టుగా అటువంటిది ఏమి చెప్పలేదు. గంగూలీ చేసిన వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం వెనుక గల అసలు కారణాన్ని బయటకు చెప్పడం లేదు. పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. కోహ్లి కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు" అని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు. కగా టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. చదవండి: Ashes Series 2021-22: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. -
ఆయన సహకారంతోనే ఈ స్థాయికి: కోహ్లి
ముంబై: ప్రపంచ క్రికెట్ చరిత్రలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏ స్థాయిలో రాణిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను కోహ్లి సంపాధించుకున్నాడు. యూత్‌కు ప్రేరణగా నిలిచిన కోహ్లి మాత్రం తన విజయాలకు చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అని శనివారం సోషల్ మీడియాలో తెలిపాడు. కాగా కోచ్ రాజ్‌కుమార్‌తో తన అనుబంధాన్ని వివరించాడు. అయితే ఏ వ్యక్తి జీవన ప్రయాణంలోనైనా గురువు విలువైన పాఠాలు బోధిస్తారని తెలిపాడు. అయితే తన కోచ్ రాజ్‌కుమార్ శర్మ అందించిన సహకారం మరువలేనని అన్నాడు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోచ్ రాజ్‌కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తామంతా ఈ స్థాయిలో రాణించడానికి ఉపాధ్యాయులు, క్రికెట్ కోచ్‌లే కారణమని పేర్కొన్నాడు. (చదవండి: వారి ప్రేమే నన్ను కట్టి పడేసింది: కోహ్లి) A teacher gives you many valuable lessons in your journey. Forever grateful for the ones I got from my coach Mr. Rajkumar Sharma 🙌😇. Happy Teacher's Day to all the teachers who've guided their students in their journeys. pic.twitter.com/LPnUXsIzhp — Virat Kohli (@imVkohli) September 5, 2020 -
కోహ్లీ 10 ఏళ్ల వయసులో నావద్దకు వచ్చాడు
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి శిష్యుడని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కితాబిచ్చాడు. కోహ్లీ 10 ఏళ్ల వయసులో క్రికెట్ నేర్చుకునేందుకు తన దగ్గరకు వచ్చాడని, ఇప్పుడు టీమిండియా కెప్టెన్ అయినా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పురాలేదని, చిన్నప్పటి కోహ్లీలాగే కనిపిస్తాడని శర్మ అన్నాడు. ద్రోణాచార్య అవార్డు తనకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, మరింతమంది విరాట్లను తయారు చేయాల్సిన బాధ్యతను పెంచిందని ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ చెప్పాడు. ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన గురువు రాజ్‌కుమార్ శర్మను విరాట్ అభినందించాడు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కోహ్లీ గురువుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. దీనిపై శర్మ స్పందిస్తూ కోహ్లీతో తన అనుబంధాన్ని వెల్లడించాడు. తల్లిదండ్రులకు, కోచ్‌కు తేడా ఉండదని, విరాట్‌ను సొంతబిడ్డలా చూసుకున్నానని చెప్పాడు. 'విరాట్ పదేళ్ల వయసులో తొలిసారి నా కోచింగ్ క్యాంప్‌నకు వచ్చాడు. ఈ రోజు టీమిండియా కెప్టెన్ అయ్యాడు. అతను నెట్ సెషన్‌కు వస్తుంటాడు. కోహ్లీలో ఏమాత్రం తేడా కనిపించదు. నాకు ఇప్పటికీ పదేళ్ల విరాట్‌లానే ఉంటాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. 2013లో కోహ్లీ అర్జున అవార్డు అందుకున్నప్పుడు రాష్ట్రపతి భవన్‌లోనే ఉన్నా. ఈసారి నేను ద్రోణాచార్య అవార్డు తీసుకునే సమయంలో కోహ్లీ హాజరవుతాడు' అని శర్మ చెప్పాడు.