
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిను తొలగించడంపై చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అసక్తికర వాఖ్యలు చేశాడు. బీసీసీఐ, సీనియర్ సెలక్షన్ కమిటీ పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకోలేదని అతడు అభిప్రాయపడ్డాడు.
“నేను విరాట్ కోహ్లితో ఇంకా మాట్లాడలేదు. అతడి ఫోన్ స్విఛ్చాఫ్‌లో ఉంది. టీ20 కెప్టెన్సీనుంచి తన ఇష్టంతోనే తప్పుకున్నాడు. సెలెక్టర్లు వెంటనే అతనిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగమని చెప్పవలిసింది. లేదంటే టీ20, వన్డే ఫార్మాట్లో కొన్నాళ్లు కోనసాగమని కోరవలిసింది. ఇలా ఒక్క సారిగా అతడిని కెప్టెన్‌గా తప్పించడం చాలా అన్యాయం "అని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. కాగా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని కోహ్లిని బీసీసీఐ కోరిందని గంగూలీ చేసిన వ్యాఖ్యలను రాజ్‌కుమార్ విభేదించాడు.
"ప్రపంచకప్‌కు ముందు టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని కోహ్లిని కోరినట్లు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను నేను చదివాను.నాకు తెలిసినట్టుగా అటువంటిది ఏమి చెప్పలేదు. గంగూలీ చేసిన వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం వెనుక గల అసలు కారణాన్ని బయటకు చెప్పడం లేదు. పారదర్శకంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. కోహ్లి కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు" అని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు. కగా టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.
చదవండి: Ashes Series 2021-22: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..