RCB Vs CSK: చివరి బెర్త్‌ ఎవరిదో? | IPL 2024: Crucial Match Between Chennai Super Kings And Royal Challengers Bangalore, Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs CSK: చివరి బెర్త్‌ ఎవరిదో?

Published Sat, May 18 2024 4:15 AM | Last Updated on Sat, May 18 2024 1:46 PM

Today is a crucial battle between Chennai and Bangalore

నేడు చెన్నై, బెంగళూరు మధ్య కీలక పోరు 

మ్యాచ్‌కు వర్ష సూచన 

బెంగళూరు: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌... మూడుసార్లు రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు ‘ప్లే ఆఫ్స్‌’ దశకు అర్హత సాధిస్తాయా లేక లీగ్‌ దశలోనే నిష్క్రమిస్తాయా ఈరోజే తేలిపోనుంది. 

ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ‘ప్లే ఆఫ్స్‌’కు అర్హత పొందగా... చివరిదైన నాలుగో బెర్త్‌ కోసం చెన్నై, బెంగళూరు జట్లు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో... బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి.  

» చెన్నైపై బెంగళూరు గెలిస్తే... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు 14 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టుకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది.  

» బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్ల కంటే చెన్నై రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. చెన్నైపై గెలవడంతోపాటు ఆ జట్టు రన్‌రేట్‌ను అధిగమించాలంటే బెంగళూరు 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించాలి. ఒకవేళ చెన్నై లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ లభిస్తుంది.  

» మరోవైపు చెన్నై విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయినా ఆ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దక్కించుకుంటుంది.  

»స్థానిక వాతావరణ శాఖ ప్రకారం శనివారం బెంగళూరు నగరానికి భారీ వర్ష సూచన ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఆ జట్టు ప్రదర్శనపైనే కాకుండా వరుణ దేవుడి దయపై కూడా ఆధారపడి ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement