మహేంద్ర సింగ్ ధోని (PC: IPL)
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2024 సీజన్‌కు తెరలేవనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా మార్చి 22న ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
ఇక సీఎస్‌కే- ఆర్సీబీ మధ్య పోటీ అంటే అభిమానులకు పండుగలాంటిదని చెప్పవచ్చు. ఓవైపు మహేంద్ర సింగ్ ధోని.. మరోవైపు విరాట్ కోహ్లి.. వీరిద్దరు భాగమైన జట్లు ప్రత్యర్థులుగా పోటీపడుతుంటే చూడటానికి ఫ్యాన్స్ మరింత ఆసక్తికగా తిలకిస్తారు. ఈసారి తొలి మ్యాచ్‌లోనే అభిమానులకు ఆ మజాను అందించేందుకు సిద్ధమయ్యారు ఐపీఎల్ నిర్వాహకులు.
ఈ నేపథ్యంలో సీఎస్‌కే మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో చెపాక్‌లో ఆడబోతుండటం శుభపరిణామం. ఎందుకంటే.. చెన్నై పిచ్‌లు క్రమక్రమంగా మారుతున్నాయి.
ఇక ముందు చెపాక్ సీఎస్‌కేకు కంచుకోటగా ఉండబోదు. గతేడాది చెన్నై చాంపియన్‌గా అవతరించినప్పటికీ.. కేకేఆర్, పంజాబ్ కింగ్స్ చేతిలో సొంతగడ్డపై ఓడిపోయిన విషయాన్ని మర్చిపోవద్దు.
అయితే, స్పిన్ అనుకూల పిచ్‌ల కారణంగా ఈసారి కూడా సీఎస్‌కే పేపర్ మీద పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, ఆర్సీబీ కూడా చెన్నై పిచ్‌పై సత్తా చాటగలిగిన జట్టే’’ అని జియో సినిమా షోలో అభినవ్ ముకుంద్ పేర్కొన్నాడు.
కాగా టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 320 పరుగులు చేశాడు అభినవ్. ఇక తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్‌లో చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 19 పరుగులే చేశాడు.
చదవండి: IPL 2024: ఐపీఎల్-17 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య
రీఎంట్రీలో దారుణం.. బౌల్ట్ బౌలింగ్‌లో చితక్కొట్టిన ట్రవిస్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment