IPL 2023- MI Vs RCB: ఐపీఎల్-2023లో వరుస పరాజయాలతో ఢీలా పడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన ఆర్సీబీ.. తాజాగా ముంబైలోనూ పరాభవాన్ని మూటగట్టుకుంది. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
ఆశలు సజీవంగా ఉండాలంటే
ఈ విజయంతో రోహిత్ సేన ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకురాగా.. వరుస ఓటముల నేపథ్యంలో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి దిగజారింది. ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. వీటిలో భారీ తేడాతో గెలుపొందితేనే బెంగళూరు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
లేదంటే.. ‘‘ఈ సాలా కప్ నామ్‌దే’’ అని గంపెడాశలు పెట్టుకున్న అభిమానులకు మరోసారి నిరాశతప్పదు. నిజానికి ఆర్సీబీ ఆరంభంలో బాగానే ఆడింది. ముఖ్యంగా ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ రాణించడం కలిసి వచ్చింది. వీరికి తోడు మాక్స్‌వెల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో వరుస విజయాలు సాధించింది.
అప్పుడు హాఫ్ సెంచరీ చేసినా
కానీ.. ప్రస్తుతం.. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో సీన్ రివర్స్ అయింది. ఢిల్లీతో మ్యాచ్‌లో కోహ్లి 55, డుప్లెసిస్ 45 పరుగులు సాధించగా.. మాక్సీ డకౌట్ అయ్యాడు. మరో బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ అర్థ శతకం సాధించడంతో 181 పరుగులు చేయగలిగిన ఆర్సీబీ.. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా ఓటమిని అంగీకరించకతప్పలేదు.
ఇప్పుడు పూర్తిగా వైఫల్యం
ఇక ముంబైతో మ్యాచ్‌లో కోహ్లి 4 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే పరిమితం కావడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయినప్పటికీ డుప్లెసిస్ (65), మాక్సీ(68) రాణించడంతో 199 పరుగులు సాధించగలిగింది. కానీ మరోసారి బౌలర్లు చేతులెత్తేయడంతో ఈ మ్యాచ్‌ను కూడా ప్రత్యర్థికి సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఆసక్తిర పోస్టుతో ముందుకు వచ్చాడు. ముంబైతో మ్యాచ్‌లో తన వైఫల్యం, ఆర్సీబీ ఓటమి నేపథ్యంలో.. ‘‘ఒత్తిళ్లను అధిగమించి నీతో నువ్వే పోరాడాలి. వాస్తవంలోనూ నీతో నీకే అసలైన పోటీ ఉంటుంది’’ అంటై లైట్ కింద కూర్చున్న ఫొటోను షేర్ చేశాడు.
కోహ్లి వర్సెస్ కోహ్లి అంతే
ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘నువ్వు నిజమైన హీరోవి. కప్ గెలిచినా.. గెలవకపోయినా నా మనస్సులో నీ స్థానం ఎప్పటికీ చెరిగిపోదు. నీలో ప్రయత్నలోపం లేదు. జట్టును గెలిపించేందుకు నీ వంతు కృషి చేస్తున్నావు’’ అని పేర్కొంటున్నారు. ఇక మరికొందరేమో.. కోహ్లిని లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్ కవ్విస్తూ పెట్టిన పోస్టులను ఉద్దేశిస్తూ.. భలే కౌంటర్ ఇచ్చాడని.. ఈ ప్రపంచంలో కోహ్లికి కోహ్లితోనే పోటీ అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్!
MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్
ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ!
WHAT. A. WIN! 👌 👌
— IndianPremierLeague (@IPL) May 9, 2023
A clinical chase from @mipaltan to beat #RCB & bag 2⃣ more points! 👏 👏
Scorecard ▶️ https://t.co/ooQkYwbrnL#TATAIPL | #MIvRCB pic.twitter.com/dmt8aegakV
Comments
Please login to add a commentAdd a comment