IPL 2023- LSG Vs RCB- #ViratGambhirFight: ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ మధ్య గొడవ జరిగి రోజులు గడుస్తున్నా.. ఈ వివాదానికి సంబంధించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. కోహ్లి- గంభీర్ మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రత్యక్ష సాక్షి ఇటీవలే కొన్ని విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కోహ్లి మాట జారడంతో గంభీర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ సదరు వ్యక్తి పేర్కొన్నారు.
ఆ మాట అనడంతో
ఈ క్రమంలో దైనిక్ జాగరణ్ తాజా కథనంలో.. గంభీర్‌కు కోపం తెప్పించిన మాటేమిటో వెల్లడించింది. అదే విధంగా గొడవ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి జరిమానా విధించిన నేపథ్యంలో కోహ్లి బీసీసీఐకి ఓ సందేశం పంపాడని పేర్కొంది. కాగా లక్నోతో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ కోహ్లి దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫ్రీ హిట్ నేపథ్యంలో.. లక్నో టెయిలెండర్ నవీన్-ఉల్-హక్‌తో గొడవ.. ఆ తర్వాత కోహ్లి జోక్యం.. అటుపై మ్యాచ్ తర్వాత లక్నో ఓపెనర్ కైలీ మేయర్స్‌తో కోహ్లి మాట్లాడుతుండగా.. గంభీర్ మధ్యలోకి రావడం వంటి పరిణామాల క్రమంలో వివాదం ముదిరింది.
బ్లడీ అసలు నువ్వేంటి?
ఈ నేపథ్యంలో కోహ్లి.. మేయర్స్‌తో మాట్లాడుతుండగా.. గంభీర్ అతడిని కోహ్లి నుంచి విడదీసే ప్రయత్నం చేశాడు. దీంతో.. ‘‘బ్లడీ.. F***. నేను అతడికి సెండాఫ్ ఇస్తుంటే మధ్యలో నువ్వేంటి’’ అని విరాట్ అన్న మాట గంభీర్ చెవిన పడటంతో అతడు కోపోద్రిక్తుడయ్యాడని దైనిక్ జాగరణ్ కథనంలో పేర్కొంది.
బీసీసీఐ అధికారులకు కోహ్లి మెసేజ్
అదే విధంగా మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 100 శాతం కోత విధించడంపై విచారం వ్యక్తం చేసిన కోహ్లిహ్లి.. ‘‘నేనసలు నవీన్ ఉల్ హక్‌ని గానీ.. గంభీర్‌ని గానీ అసలు ఏమీ అనలేదు’’ అని కొంతమంది అధికారులకు మెసేజ్ చేసినట్లు తెలిపింది. తన తప్పేమీ లేకపోయినా ఫైన్ విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
నవీన్‌పైకి బంతి విసరాలని తాను సిరాజ్‌కు చెప్పలేదని.. బౌన్సర్స్ వేయాలని మాత్రమే సూచించినట్లు కోహ్లి పేర్కొన్నట్లు తెలిపింది. కాగా ఈ వార్తలపై స్పందించిన కింగ్ ఫ్యాన్స్.. గంభీర్ కావాలనే గొడవను పెద్దది చేసి రచ్చ చేశాడని.. ఇందులో కోహ్లి తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. గంభీర్ అభిమానులు మాత్రం.. ‘‘చేసిందంతా చేశావు.. టీవీలో అందరూ చూశారు. అయినా.. మళ్లీ ఇప్పుడిలా మెసేజ్‌లు పెడతావా?’’ అని కోహ్లి తీరుపై మండిపడుతున్నారు.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment