IPL 2024 Schedule Released: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.
మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. సాధారణంగా డిఫెండింగ్ చాంపియన్- రన్నరప్ మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్ ఆరంభించడం ఆనవాయితీ.
ఆ తేదీల్లో డబుల్ మ్యాచ్‌లు
అయితే, ఈ సారి అందుకు భిన్నంగా సీఎస్‌కే- గుజరాత్ టైటాన్స్‌కు బదులు.. సీఎస్‌కే- ఆర్సీబీతో పదిహేడవ ఎడిషన్ మొదలుపెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 22- ఏప్రిల్ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఐపీఎల్-2024 తొలి 17 రోజుల షెడ్యూల్
►మార్చి 22- సీఎస్‌కే- ఆర్సీబీ- చెన్నై
►మార్చి 23- పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్- మొహాలీ(మధ్యాహ్నం)
►మార్చి 23- కేకేఆర్- సన్‌రైజర్స్- కోల్‌కతా(రాత్రి)
►మార్చి 24- రాజస్తాన్- లక్నో సూపర్ జెయింట్స్- జైపూర్(మధ్యాహ్నం)
►మార్చి 24- గుజరాత్ టైటాన్స్- ముంబై ఇండియన్స్- అహ్మదాబాద్(రాత్రి)
►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్- బెంగళూరు
►మార్చి 26- సీఎస్‌కే- గుజరాత్- చెన్నై
►మార్చి 27- సన్‌రైజర్స్- ముంబై- హైదరాబాద్
►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్
►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు
►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో
►మార్చి 31- గుజరాత్- సన్‌రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం)
►మార్చి 31- ఢిల్లీ- సీఎస్‌కే- వైజాగ్
►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై
►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు
►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్
►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్
►ఏప్రిల్ 5- సన్‌రైజర్స్- సీఎస్‌కే- హైదరాబాద్
►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్
►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై
►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో
Photo Credit: Star Sports X
వేదికలు
చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి 17 రోజుల షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైజాగ్ హోం గ్రౌండ్‌గా ఉండనుంది. ఇక మధ్యాహ్నం 3.30, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.
🚨 𝗦𝗧𝗢𝗣 𝗧𝗛𝗘 𝗣𝗥𝗘𝗦𝗦 - TATA #IPL2024 Schedule is HERE! 🤩
— Star Sports (@StarSportsIndia) February 22, 2024
Get ready for the thrill, excitement and fun to begin! Save this post so you don't have to search for it again 🔍
It's #CSKvRCB, @msdhoni 🆚 @imVkohli in the opener! Who's your pick ? 👀#IPLSchedule #IPLonStar pic.twitter.com/oNLx116Uzi
మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే
కాగా ఐపీఎల్–2024 పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట మ్యాచ్‌లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు దీంతో తెర పడింది. ‘మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాం.
తేదీల విషయంపై మేం ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాం. ముందుగా 15 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేస్తాం. ఆపై తర్వాతి తేదీలను ప్రకటిస్తాం. అయితే అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే జరగడం ఖాయం’ అని ధూమల్ స్పష్టం చేశారు. అయితే, గురువారం తొలి 17 రోజుల మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయడం గమనార్హం.
అప్పట్లో ఆ దేశాల్లో నిర్వహణ
కాగా ఐపీఎల్ ప్రారంభమైన తర్వాతి ఎన్నికల సమయంలో 2009లో టోర్నీ మొత్తం దక్షిణాఫ్రికాలో జరిగింది. 2014లో కొన్ని మ్యాచ్‌లు భారత్‌లో, మరికొన్ని యూఏఈలో నిర్వహించారు. అయితే 2019లో మాత్రం మొత్తం టోర్నీ ఇక్కడే జరిగింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత కొద్ది రోజుల్లోనే టి20 ప్రపంచ కప్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్ ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది.
కళ్లన్నీ వారిద్దరిపైనే
ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ప్రధానంగా టీమిండియా స్టార్లు హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌పైనే ఎక్కువ ఫోకస్ కానున్నారు. గుజరాత్ టైటాన్స్‌ను ఆరంభ సీజన్‌లోనే విజేతగా.. తదుపరి రన్నరప్‌గా నిలిపిన ఆల్‌రౌండర్ పాండ్యా.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీని వీడాడు.
ముంబై ఇండియన్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుని తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. మరోవైపు.. 2022, డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్ ఈ సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment