వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. తాజాగా ఈ మెగా ఫైనల్‌కు ముందు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్ కంటికి గాయమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-2లో కిషన్ గాయపడ్డాడు.
17వ ఓవర్ ప్రారంభానికి ముందు అనుకోకుండా పేసర్ క్రిస్ జోర్డాన్ ఇషాన్ కిషన్‌ను ఢీకొట్టాడు. అతడి మోచేయి కిషన్ ఎడమ కన్నుకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో కన్నుపై చెయివేసుకుని మైదానం వీడడాడు. అనంతరం కిషన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా విష్ణు వినోద్ వచ్చాడు.
ఇక ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కాగా.. తాజాగా కిషన్ కూడా గాయం బారిన పడడం భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. కాగా గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో కిషన్‌ను ఎంపిక చేసిన విషయం విధితమే. ఇక జూన్ 7నుంచి లండన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
చదవండి: IPL 2023 QF 2 MI VS GT: గిల్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు.. నేను ఆధారపడేది రషీద్‌పైనే: హార్ధిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment