
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 7 నుంచి లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, భారత జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
భారత జట్టు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నెట్స్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో భాగంగా నెట్ బౌలర్ అనికిత్ చౌదరీ వేసిన బంతి కిషన్ చేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన కిషన్ తర్వాతి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్‌గా కిషన్, శ్రీకర్ భరత్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
కొంతమంది భరత్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తుంటే.. మరి కొంతమంది కిషన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు గాయం కారణంగా జట్టు సెలక్షన్‌కు కిషన్ అందుబాటులో లేకపోతే.. భరత్‌కు చోటు ఖాయమైనట్లే. కాగా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా గాయల కారంగా దూరమైన సంగతి తెలిసిందే.
చదవండి: Wrestlers Protest: రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. క్లారిటీ ఇదిగో!
Comments
Please login to add a commentAdd a comment