ఐపీఎల్-2023 ముగిసిన వెంటనే భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌కు పయనం కానున్న సంగతి తెలిసిందే. జూన్ 7నుంచి లండన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టును మూడు బ్యాచ్‌లుగా ఇంగ్లండ్‌కు పంపాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌ను నిర్వహించే విధంగా బీసీసీఐ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ పూర్తి అయిన వెంటనే మొదట బ్యాచ్ ఇంగ్లండ్‌కు పయనం కానున్నట్లు క్రిక్‌బజ్ రిపోర్ట్ తమ నివేదికలో పేర్కొంది. ఈ బ్యాచ్‌లో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించని జట్లలో భాగమైన భారత ఆటగాళ్లు ఉండనున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది.
మొదటి బ్యాచ్ మే 23 న ఇంగ్లండ్‌కు బయలు దేరే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఫైనల్‌కు అర్హత సాధించని జట్లలో ఉండే ఆటగాళ్లు రెండో బ్యాచ్‌గా ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. ఆఖరిగా మే 28న ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే మూడో బ్యాచ్‌గా ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. మొదటి బ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, అశ్విన్ ఉండే అవకాశం ఉంది.
చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్
Comments
Please login to add a commentAdd a comment