Harshal Patel Breaks Chahal IPL Record: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా బుధవారం(సెప్టెంబర్ 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్(11 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు) రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకోవడంతో ద్వారా హర్షల్.. సహచర ఆటగాడు చహల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. చాహల్ 2015లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి 15 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో హర్షల్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ సీజన్‌లో ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు(23 వికెట్లు) చహల్, వినయ్‌కుమార్‌ల పేరిట ఉండేది. ప్రస్తుత సీజన్‌లో హర్షల్ మరో 7 వికెట్లు పడగొడితే లీగ్ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 2013 సీజన్‌లో చెన్నై బౌలర్ డ్వేన్ బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ ఆఖరి ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ మధ్యే ముంబైతో మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఇప్పటివరకు 59 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన హర్షల్ 72 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్ చరిత్రలో అత్యధికం
Comments
Please login to add a commentAdd a comment