PC: IPL.com
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆర్సీబీతో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలిపొందింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి రాహుల్ సేన చేధించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టార్గెట్‌ను ఛేధించిన నాలుగో జట్టుగా లక్నో నిలిచింది.
కాగా 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆరంభంలో తడబడింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ క్రమంలో స్టోయినిష్(65), పూరన్(62) మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నో శిబరంలో గెలుపు ఆశలను రేకెత్తించాడు. అయితే 18 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో పూరన్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. దీంతో ఆట ఆఖరిలో హై డ్రామా చోటు చేసుకుంది.
ఆట చివర్లో అలా...
పూరన్ అవుటైన సమయంలో లక్నో స్కోరు 189/6. మరో 18 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కానీ తర్వాతి ఆట మొత్తం మలుపులతో సాగింది. 9 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన సురక్షిత స్థితిలో పార్నెల్ బౌలింగ్‌లో బదోని స్కూప్ షాట్‌తో బంతిని సిక్సర్‌గా మలచడంతో లక్నో సంబరపడింది. కానీ అతని బ్యాట్ స్టంప్స్‌కు తాకడంతో బదోని వెనుదిరగాల్సి వచ్చింది. చివరి ఓవర్లో 5 పరుగులు సునాయాసంగానే అనిపించినా హర్షల్ 5 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. స్కోర్లు సమం కాగా, లక్నో విజయానికి చివరి బంతికి ఒక పరుగు కావాలి.
అయితే బంతి వేయకముందే బిష్ణోయ్ క్రీజు దాటి ముందుకు వెళ్లడంతో హర్షల్ ‘మన్కడింగ్’కు ప్రయతి్నంచాడు. కానీ బంతి స్టంప్స్‌ను తాకలేదు. దాంతో రనౌట్ కోసం త్రో చేశాడు. స్టంప్స్ ఎగిరినా, నిబంధనల ప్రకారం అలా రెండు సార్లు చేయడం కుదరదని అంపైర్ చెప్పేశాడు.
దాంతో బిష్ణోయ్ నాటౌట్‌గా తేలాడు. చివరి బంతిని అవేశ్ ఆడలేకపోగా, కీపర్ దినేశ్ కార్తీక్ కూడా తడబడి దానిని నేరుగా అందుకోవడంలో విఫలమయ్యాడు. అతను త్రో చేసేలోగా బిష్ణోయ్ ఆ వైపు, అవేశ్ ఈ వైపునకు వచ్చేశారు! దాంతో లక్నో జట్టు ఆనందాన్ని ఆపడం ఎవరితరం కాలేదు.
చదవండి: IPL 2023 Dinesh Karthik: ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్
Virat Kohli mocking his own RCB teammate Harshal Patel for Mankad / Mankading.
— Chintan (@ChinTTan221b) April 10, 2023
R Ashwin gonna get good sleep today. pic.twitter.com/Qnvnv1WaGZ
Comments
Please login to add a commentAdd a comment