IPL 2023: Virat Kohli Scores 46th IPL Fifty, Completes Unique Record - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కోహ్లి..

Published Tue, Apr 11 2023 9:43 AM | Last Updated on Tue, Apr 11 2023 11:48 AM

IPL 2023: Virat Kohli Scores 46th IPL Fifty, Completes Unique Record - Sakshi

ఐపీఎల్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం ఆడుతున్న 9 యాక్టివ్‌ టీమ్స్‌పై హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌తో కలిసి విరాట్‌ సంయుక్తంగా నిలిచాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో చెలరేగిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

లక్నోతో మ్యాచ్‌కు ముందు మిగిలిన 8 ఫ్రాంచైజీలపైన అర్థ సెంచరీలు సాధించాడు.  ఇక ఐపీఎల్‌ కెరీర్‌లో విరాట్‌కు ఇది 46వ హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. కాగా మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తేడాతో లక్నో చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది.

ఐపీఎల్‌ టీమ్స్‌పై కోహ్లి చేసిన హాఫ్‌ సెంచరీలు ఇవే..
చెన్నై సూపర్ కింగ్స్ - 9
ఢిల్లీ క్యాపిటల్స్‌ - 8
కోల్‌కతా నైట్ రైడర్స్ - 5
ముంబై ఇండియన్స్ - 5
సన్‌రైజర్స్ హైదరాబాద్ - 4
రాజస్థాన్ రాయల్స్ - 4
పంజాబ్ కింగ్స్ - 3
గుజరాత్ లయన్స్ - 3
రైజింగ్ పూణె సూపర్ జెయింట్ - 3
డెక్కన్ ఛార్జర్స్ - 3
గుజరాత్ టైటాన్స్ - 2
లక్నో సూపర్ జెయింట్స్ - 1
పూణే వారియర్స్ - 1
కొచ్చి టస్కర్స్ - 0
చదవండి: IPL 2023 Dinesh Karthik: ఎంత పనిచేశావు కార్తీక్‌.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement