
PC:IPL.com
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. లక్నో కేవలం 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో దీపక్ హుడా క్రీజులో వచ్చాడు.
ఈ సమయంలో ఎంతో బాధ్యతయుతంగా ఆడిల్సిన అతడు.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో మాత్రం హుడా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు. 17, 2, 7, 9, 2, 2, 2, 11, 1 ఇవి అతడు తన ఆఖరి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు. ఇక వరుసగా విఫలమవుతున్నప్పటికీ అతడికి అవకాశం ఇస్తున్న లక్నో మేనెజ్‌మెంట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇంత చెత్త ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇంకా జట్టులో చోటు అవరసరమా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి కొంత మంది హుడా తప్ప ఇంకా ఎవరూ జట్టులో లేరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ చేతిలో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది.
చదవండి: #Kohli Vs Naveen-ul-Haq: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్