హర్షల్ పటేల్(PC: IPL/BCCI)
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి, 35 పరుగులు ఇచ్చాడు. ఇక అద్భుతమైన ప్రదర్శనకు గాను హర్షల్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేడు. తన స్పెల్‌లో తొలి మూడు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షల్.. అఖరి ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ ఓవర్‌లో కీలకమైన డ్వైన్ ప్రిటోరియస్ వికెట్ సాధించాడు. “నేను నా మొదటి ఓవర్‌లో స్లో బాల్స్ వేయడానికి ప్రయత్నించాను. అయితే పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి నా బౌలింగ్‌లో మార్పులు చేశాను.
లెఫ్ట్ హ్యాండర్లిద్దరికీ వైడ్ ఆఫ్‌సైడ్ బౌలింగ్ చేశాను. ఎందుకుంటే ఆఫ్‌సైడ్ బౌండరీలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి. బ్యాటర్లు స్లో బాల్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నప్పుడు.. గతంలో నేను యార్కర్లు సంధించేవాడిని. కానీ ఈ సీజన్‌లో యార్కర్లు వేయలేకపోతున్నాను. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో యార్కర్లు వేయడానికి ప్రయత్నిస్తాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హర్షల్ పటేల్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: ఒకప్పుడు నెట్ బౌలర్‌గా.. ఇప్పుడు ఏకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో..!
Comments
Please login to add a commentAdd a comment