టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో హర్షల్ పటేల్(ఫైల్)
IPL 2022 Auction: ఐపీఎల్-2021 సీజన్‌లో అద్భుతంగా రాణించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ హర్షల్ పటేల్. 15 ఇన్నింగ్స్‌లో 32 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే, రిటెన్షన్ సమయంలో మాత్రం యాజమాన్యం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. హర్షల్ కంటే కూడా టీమిండియాలో రెగ్యులర్ పేసర్‌గా మారిన సిరాజ్ వైపు ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది.
స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (రూ.15 కోట్లు) , ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు), సిరాజ్ (రూ. 7 కోట్లు)లను అట్టిపెట్టుకుంది. అత్యధికంగా నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నా హర్షల్‌ను వదిలేసింది. దీంతో అతడు మెగా వేలంలోకి రానున్నాడు. ఈ క్రమంలో క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తనను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘‘నన్ను రిటైన్ చేసుకోలేదని తెలిసిన వెంటనే... ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ నాకు కాల్ చేశారు. పర్సులో సరిపడా డబ్బు లేనందు వల్లే నన్ను వదిలేశామని చెప్పారు. కాబట్టి మెగా వేలంలో వాళ్లు కచ్చితంగా నన్ను పరిగణనలోకి తీసుకుంటారనుకుంటున్నా.. నేను కూడా మరోసారి ఆర్సీబీకి ఆడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే... ఐపీఎల్-2021 సీజన్‌లో బెంగళూరు జట్టుకు ఆడటం.. నా కెరీర్‌ను మాత్రమే కాదు... నా జీవితాన్ని కూడా కీలక మలుపు తిప్పింది’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు.
ఇక వేలం నేపథ్యంలో ఇప్పటి వరకు తనను ఏ ఫ్రాంఛైజీ సంప్రదించలేదని హర్షల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2021 ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పేసర్.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు వికెట్లతో రాణించి... కివీస్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల హర్షల్‌ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడతాయడనంలో ఏమాత్రం సందేహం లేదు.
చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే..
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్ విధించిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment