
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ అర్ధసెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పుడు.. పరాగ్ తన అద్భుత ఇన్నింగ్స్ జట్టును అదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కాగా రాజస్తాన్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో పరాగ్ 18 పరుగులు పరగులు రాబాట్టాడు.
అయితే హర్షల్ పటేల్ వేసిన అఖరి బంతికి పరాగ్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో రియాన్ పరాగ్, హర్షల్ పటేల్‌కి మధ్య మాటల యుద్దం జరిగింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేసి పెవిలియన్‌కు వెళ్తున్న పరాగ్.. హర్షల్ పటేల్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడు. అది విన్నహర్షల్ పటేల్ పైపైకి వచ్చాడు. వెంటనే రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో ఒకరు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2022: "గత మ్యాచ్‌లు గురించి ఆలోచించం.. ప్లేఆఫ్స్‌కు మేము వచ్చామంటే.. కప్ మదే
Harshal vs riyan parag fight#RCBvsRR #parag #HarshalPatel #IPL20222 pic.twitter.com/Xotv4DGF8T
— John cage (@john18376) April 26, 2022