Harshal Patel Shared Before After Picture With Team India Head Coach Rahul Dravid: ఆలస్యంగానైనా సరే టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న కలను నెరవేర్చుకున్నాడు హర్షల్ పటేల్. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హర్షల్.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. రెండో టీ20లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ పటేల్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక 30 ఏళ్ల 361 రోజుల వయసులో పొట్టి ఫార్మాట్‌లో అడుగుపెట్టిన హర్షల్.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తాజాగా రెండు ఫొటోలు షేర్ చేశాడు.
‘‘ఎలా మొదలైంది.. ఎలా కొనసాగుతోంది’’ అన్న క్యాప్షన్‌తో ద్రవిడ్‌తో దిగిన పాత, కొత్త ఫొటోలను పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘2004కు... ఇప్పటికీ పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదు. కానీ నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలగా ముందుకు సాగిన విధానం మాత్రం మమ్మల్ని ఆకట్టుకుంటోంది’’ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ద్రవిడ్ నమ్మకాన్ని గెలుచుకోవడమే కాదు.. దానిని నిలబెట్టుకున్నావు కూడా అంటూ అభినందిస్తున్నారు.
కాగా లేటు వయసులో టీ20లో ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్ (38 ఏళ్ల 232 రోజులు).. మొదటి స్థానంలో ఉండగా.. హర్షల్ ఆరో స్థానంలో కొనసాగుతుండటం విశేషం. ఇక ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షల్ పటేల్.. 2021 సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 32 వికెట్లు తన ఖాతాలో వేసుకుని పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు.
చదవండి: India vs New Zealand: గిల్ కళ్లు చెదిరే సిక్స్ .. వీడియో వైరల్
IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో
Comments
Please login to add a commentAdd a comment