IPL2022: Harshal Patel Becomes 2nd Bowler IPL History Bowl Two Maidens in Match - Sakshi
Sakshi News home page

Harshal Patel: ఐపీఎల్‌ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌

Published Wed, Mar 30 2022 10:23 PM | Last Updated on Thu, Mar 31 2022 8:39 AM

Harshal Patel Becomes 2nd Bowler IPL History Bowl Two Maidens In Match  - Sakshi

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో  వరుసగా రెండు మెయిడెన్‌ ఓవర్లు వేసిన రెండో బౌలర్‌గా హర్షల్‌ పటేల్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ 2022లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో హర్షల్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. ఇంతకముందు ఆర్‌సీబీకే చెందిన మహ్మద్‌ సిరాజ్‌ అదే కేకేఆర్‌పై ఐపీఎల్‌ 2020లో తన వరుస రెండు ఓవర్లను మెయిడెన్‌ వేసి తొలి బౌలర్‌గా ఉన్నాడు.

ఇక 12వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన హర్షల్‌ ఆ ఓవర్‌ను మెయిడెన్‌ వేశాడు. అంతేకాదు తన తొలి ఓవర్‌లోనే సామ్‌ బిల్లింగ్స్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌ను కూడా మెయిడెన్‌ వేసిన హర్షల్‌ ఈసారి రసెల్‌ రూపంలో రెండో వికెట్‌ తీసుకున్నాడు. మొత్తంగా రెండు ఓవర్లు ముగిసేసరికి హర్షల్‌ స్పెల్‌ 2-2-0-2గా ఉంది. ఏ క్రికెటర్‌కైనా ఇది బెస్ట్‌ స్పెల్‌ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మూడో ఓవర్‌నూ దాదాపు అదే రీతిలో బౌల్‌ చేసిన హర్షల్‌.. ఓవరాల్‌గా తన కోటా బౌలింగ్‌ను (4-2-11-2)తో ముగించాడు. 

చదవండి: IPL 2022: క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది

పవర్‌ ప్లేను కూడా వదలని ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇంకెన్ని చూడాలో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement