
Photo Courtesy: Twitter
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ రెండు ఫుల్‌టాస్ నో బాల్స్(బీమర్లు) వేశాడు. అయిన్పటికీ ఫీల్డ్ అంపైర్లు అతనికి ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఒక బీమర్‌ను చివరి ఓవర్ మూడో బంతికి సంధించిన హర్షల్.. 18 ఓవర్ నాల్గో బంతికి బీమర్ వేశాడు. ఈ రెండు బీమర్లలో ఒక దాన్ని రషీద్ ఖాన్ బౌండరీకి తరలించాడు. ఆఖరి ఓవర్‌లో యార్కర్ వేసే యత్నంలో బీమర్ పడగా, దాన్ని రషీద్ ఖాన్ భారీ షాట్‌గా మలిచాడు. కాగా, ఒక మ్యాచ్‌లో రెండు బీమర్లు వేసిన హర్షల్ పటేల్‌ను ఎందుకు ఓవర్ వేయకుండా నిషేధించలేదని డగౌట్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 2017 లో మార్చిన క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక బౌలర్ రెండు బీమర్లు వేసి వార్నింగ్‌కు గురైతే అతన్ని మళ్లీ బౌలింగ్ ఎటాక్‌కు దిగకుండా నిబంధనను మార్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధననే గుర్తుచేశాడు వార్నర్. ఎందుకు హర్షల్ పటేల్ బౌలింగ్ చేయకుండా ఆపలేదని ప్రశ్నించాడు.
ఇదే విషయాన్ని డగౌట్‌లో ఉన్న వారితో పంచుకున్నాడు ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్. అయితే వార్నర్ ఏదైతే అనుకున్నాడో అది తప్పని అంటున్నాడు ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్. హర్షల్ పటేల్‌కు అంపైర్ ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదో వివరించాడు. ట్రేవర్ బేలిస్. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన బేలిస్.. ‘హర్షల్ రెండు బీమర్లు వేసిన మాట నిజమే. మామూలుగా రెండు బీమర్లు వేస్తే ఆ బౌలర్ బౌలింగ్ ఎటాక్ నిలిపివేయాలి. కానీ అంపైర్స్ అలా చేయలేదు. ఇక్కడ అంపైర్స్ చేసింది కర్టెక్టే. జేసన్ హోల్డర్‌కు హర్షల్ పటేల్ వేసిన తొలి బీమర్ బ్యాటర్స్ బాడీని టార్గెట్ చేసేదిగా లేదు. అది బ్యాట్స్‌మన్ బాడీకి బాగా పక్కగా వెళ్లింది.
దాంతో రెండో బీమర్ వేసినా కూడా అంపైర్ ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఇక్కడ అంపైర్ చేసింది కరెక్ట్’ అని బేలిస్ చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా తాము మంచి క్రికెట్ ఆడకపోవడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని బేలీస్ అన్నాడు. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చతికిలబడింది. గెలవాల్సిన మ్యాచ్‌ను తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టింది. ఆరు పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్ తిరిగి తేరుకోలేకపోయింది. 0 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్ పరాజయం చెందింది.
ఇక్కడ చదవండి: విరాట్ కోహ్లికి మందలింపు
Comments
Please login to add a commentAdd a comment