Harshal Patel (Photo Credit: IPL/BCCI)
Harshal Patel on His hat-trick Celebrations Vs MI: కెరీర్‌లో తొలి హ్యాట్రిక్ విజయం సాధించడం ఏ బౌలర్‌కైనా మధుర జ్ఞాపకమే. అలాంటి ఆనంద క్షణాల్లో పక్కన ఉన్న వాళ్లతో సంతోషం పంచుకోవడం, ఎగిరి గంతేయడం సహజం. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా సెప్టెంబరు 26న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ అలాంటి అద్భుత అనుభూతిని పొందాడు.
17వ ఓవర్‌లో ముంబై ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చహర్ వెంట వెంటనే అవుట్ చేసి.. తొలి హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో అతడి సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి, సహచర బౌలర్ మహ్మద్ సిరాజ్ సహా జట్టు సభ్యులంతా అతడిని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.
అయితే, ఆ సమయంలో కోహ్లి, సిరాజ్‌కు చిన్నపాటి అసౌకర్యం కలిగింది. స్వల్ప గాయాలు కూడా అయ్యాయట. ఈ విషయం గురించి 30 ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్20.కామ్‌తో మాట్లాడుతూ.. తన వల్ల వాళ్లిద్దరికీ ఇబ్బంది కలిగిందన్నాడు. ‘‘అవును.. నా సెలబ్రేషన్స్‌లో భాగంగా సిరాజ్ కాలికి గాయమైంది. అయితే, ఇప్పుడు తను బాగున్నాడు. హ్యాట్రిక్ కొట్టిన ఆనందంలో కోహ్లి... తొడను గట్టిగా రుద్దేశాను.
తనకు అసౌకర్యం కలిగించాను. అందుకే, సెలబ్రేషన్ అయి పోగానే వారిద్దరి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశాను’’ అని చెప్పుకొచ్చాడు. బుధవారం నాడు రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఈ మేరకు మాట్లాడుతూ... తన బౌలింగ్ శైలికి యూఏఈ పరిస్థితులు చక్కగా సరిపోతాయని పేర్కొన్నాడు. ఇక నిన్నటి మ్యాచ్‌లో హర్షల్ పటేల్.. 3 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే.
చదవండి: Glenn Maxwell: కోహ్లి 10 వేలు, మాక్సీ 7 వేల పరుగులు.. ఇప్పుడు చెప్పండిరా!
T20 World Cup 2021: మంచి ఫామ్‌లో ఉన్నాడు.. కానీ దురదృష్టవంతుడు
We couldn’t be more proud of that performance last night, @HarshalPatel23! 🤩#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/vq0YkoMbU8
— Royal Challengers Bangalore (@RCBTweets) September 27, 2021
Comments
Please login to add a commentAdd a comment