IPL 2022: RCB Player Harshal Patel Pens Emotional Letter For His Late Sister, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022: "చెల్లీ.. మ‌ళ్లీ నేను ఆడుతున్నానంటే కార‌ణం నీవే"..

Published Mon, Apr 18 2022 1:17 PM | Last Updated on Mon, Apr 18 2022 1:40 PM

RCBs Harshal Patel gets emotional, pens Heartfelt letter for late sister - Sakshi

PC: IPL

టీమిండియా పేస‌ర్‌, ఆర్సీబీ స్టార్ పేస‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ సోద‌రి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. దీంతో హ‌ర్ష‌ల్ ప‌టేల్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు బ‌యోబ‌బుల్ వీడి సోద‌రి అంత్యక్రియ‌ల్లో పాల్గొన్నాడు. అయితే ఒక్క రోజులో తిరిగి  మ‌ళ్లీ ఆర్సీబీ జ‌ట్టులో చేరి హ‌ర్ష‌ల్ ప‌టేల్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. తాజాగా త‌న చెల్లెల‌ను ఉద్దేశించి ఓ ఎమోష‌న‌ల్ నోట్‌ను ఇన్స్టాగ్రామ్ వేదిక‌గా హ‌ర్ష‌ల్ ప‌టేల్ షేర్ చేశాడు.

"మా జీవితాల్లో అత్యంత‌ విలువైన వ్య‌క్తివి నీవు. నీవు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. తుది శ్వాస విడిచే వ‌ర‌కూ నీ ముఖం మీద చిరు న‌వ్వు పోనివ్వ‌లేదు. నీ జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎద‌ర్కొన్నావు. నేను నీతో హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడు నా ఆట‌పై దృష్టి పెట్టమని.. తిరిగి ఇండియాకు పంపించేశావు. ఆ మాట‌ల వ‌ల్ల‌నే నేను వచ్చి మ‌ళ్లీ ఆడ‌గాలిగాను.

నీ మాట‌ల‌ను  గౌరవిస్తూ, నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటానని చెప్పడానికి నేను చేయగలిగింది ఇదే. నేను చేసే ప్ర‌తీ ప‌ని నీవు గ‌ర్వ‌ప‌డేలా చేస్తాను. నా జీవితంలోని  ప్ర‌తీ క్షణం నిన్ను  మిస్ అవుతున్నా. అవి మంచివైనా చెడ్డ‌వైనా. ఐ లవ్ యూ సో మచ్... రెస్ట్ ఇన్ పీస్ జదీ’" అంటూ హ‌ర్ష‌ల్ ప‌టేల్  ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

 చ‌ద‌వండి: IPL 2022 CSK Vs GT: "వెల్‌క‌మ్ బ్యాక్ రుత్‌రాజ్.. అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడావు"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement