ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్దమైంది. మంగళవారం(ఏప్రిల్ 12) డివై పాటెల్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు సీఎస్కే బోణీ కొట్టలేదు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యా్చ్‌ల్లోనూ ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో సీఎస్‌కే నిలిచింది. కాగా ఆర్సీబీపై విజయం సాధించి క్యాష్ రీచ్ లీగ్‌లో సీఎస్‌కే తొలి విజయం సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్లు బలాబలాలు ఓ సారి పరిశీలిద్దాం. కాగా గత మ్యాచ్‌లో స్పిన్నర్ మహేశ్ తీక్షణనను సీఎస్‌కే తుది జట్టులోకి తీసుకుంది.
అయితే అతడు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అండర్-19 సంచలనం రాజవర్ధన్ హంగర్గేకర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ పరంగా సీఎస్‌కే పటిష్టంగా కన్పిస్తోంది. రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక రుత్‌రాజ్ గైక్వాడ్ ఫామ్‌లోకి వస్తే ఆ జట్టుకు మరింత కలిసిస్తోంది. మరో వైపు బౌలింగ్ పరంగా చెన్నై బలహీనంగా ఉంది.
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు ఆర్సీబీ సాధించింది. బౌలింగ్ బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ పటిష్టంగా కన్పిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తుది జట్టలోకి జోష్ హాజల్‌వుడ్ వచ్చే అవకాశం ఉంది.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(అంచనా)
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్, వనిందు హసరంగా, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్
చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా)
రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, ఎంస్ ధోని (వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, రాజవర్ధన్ హంగర్గేకర్
Comments
Please login to add a commentAdd a comment