Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఆటగాడు లవ్‌నీత్ సిసోడియా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా సిసోడియా అవకాశం రాలేదు. కర్ణాటకకు చెందిన ఈ యువ ఆటగాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. 20 లక్షలకు సిసోడియాను ఆర్సీబీ కొనుగోలు చేసింది.
ఇక అతడి స్థానంలో మధ్యప్రదేశ్ యువ ఆటగాడు రజత్ పాటిదార్‌ను భర్తీ చేసింది. గతేడాది సీజన్‌లో ఆర్సీబీకు ప్రాతినిద్యం వహించిన పాటిదార్ పర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఆర్పీబీ అతడిని రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో వేలంలోకి వెళ్లిన పాటిదార్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే మళ్లీ అతడిని ఆర్సీబీ కొనుగోలు చేయడం విశేషం. దేశీయ స్థాయిలో 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్ 861 పరుగులు సాధించాడు. ఇక ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్5న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2022 CSK Vs PBKS: ఆహా ఏమా షాట్.. ! 108 మీటర్ల భారీ సిక్సర్ బాదిన లివింగ్‌స్టోన్
Comments
Please login to add a commentAdd a comment