PC: IPL/ Bcci
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెన్నైసూపర్ కింగ్స్‌తో తన అనుబంధాన్ని ముగించినప్పటికీ సీఎస్కే ఫ్యాన్స్ ఇంకా అతడిని అభిమానిస్తూనే ఉన్నారు. కాగా బుధవారం(మార్చి30) ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే అభిమానులు ప్రత్యేక బ్యానర్‌తో సందడి చేశారు. ఆ బ్యానర్‌లో "మేము చెన్నైసూపర్ కింగ్స్ అభిమానులం, కానీ డుప్లెసిస్ కోసం మేము ఇక్కడకు వచ్చాం" అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఐపీఎల్-2022లో మెగా వేలంలో డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు డుప్లెసిస్‌కు అప్పగించింది. ఇక ఐపీఎల్-2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందిన ఆర్సీబీ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్ (25), ఉమేశ్ యాదవ్(18) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా 4, ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ సాదించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి చేధించింది.. ఆర్సీబీ బ్యాటర్లలో రూథర్‌పోర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, ఉమేవ్ యాదవ్ 2, నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు.
చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. సిక్సర్ల వీరుడు వచ్చేశాడు!
Fans poster during #RCBvsKKR :
— CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) March 30, 2022
"We are CSK fans, but we are here for Faf Du Plessis @faf1307 💛🦁." #WhistlePodu | #IPL2022 pic.twitter.com/K6wg4oF1Be
Comments
Please login to add a commentAdd a comment