Courtesy: IPL Twitter
Breadcrumb
IPL 2022: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
Published Fri, May 13 2022 7:01 PM | Last Updated on Fri, May 13 2022 11:31 PM
Live Updates
IPL 2022: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ అప్డేట్స్
ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బ్యాటర్లలో మాక్స్వెల్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ మూడు, రాహుల్ చాహర్, రిషిదావన్ చెరో రెండు, హార్ప్రీత్ బ్రార్, ఆర్షదీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్(70), జానీ బెయిర్‌స్టో(66) పరుగులతో చెలరేగారు. ఆర్సీబీ బౌలర్లలో హార్షల్ పటేల్ నాలుగు వికెట్లు, హాసరంగా రెండు, మాక్స్వెల్, షబాజ్ ఆహ్మద్ చెరో వికెట్ సాధించారు.
17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 137/8
17 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ 137 పరుగులు చేసింది.
ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
120 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన కార్తీక్.. ఆర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో రాజపాక్సకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ : 120/6
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. మాక్స్వెల్ ఔట్
ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన మాక్స్వెల్.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో.. ఆర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోర్: 109/5
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
104 పరుగుల ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన పాటిదార్.. చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 104/4
8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 71/3
8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్వెల్(19), పాటిదార్(12) ఉన్నారు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. రిషి ధావన్ వేసిన రెండో ఓవర్లో.. డుప్లెసిస్(10), లోమ్రోర్(6) పెవిలియన్‌కు చేరారు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 41/3
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి ఔట్
33 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రబాడ బౌలింగ్‌లో చాహర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 19/0
2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 19 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), డుప్లెసిస్(6) పరుగులతో ఉన్నారు.
చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ 210 పరుగులు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్(70), జానీ బెయిర్‌స్టో(66) పరుగులతో చెలరేగారు.
ఆర్సీబీ బౌలర్లలో హార్షల్ పటేల్ నాలుగు వికెట్లు, హాసరంగా రెండు, మాక్స్వెల్, షబాజ్ ఆహ్మద్ చెరో వికెట్ సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
164 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జితేష్ శర్మ... హాసరంగా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
152 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 152/4
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్..
101 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 105/3
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
85 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది.హాసరంగా బౌలింగ్‌లో రాజపాక్స(1) ఔటయ్యాడు.
చెలరేగి ఆడుతోన్న పంజాబ్.. 6ఓవర్లకు 83/1
6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి పంజాబ్ కింగ్స్ 83 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో చెలరేగి ఆడుతున్నాడు. 21 బంతుల్లొ అర్ధసెంచరీ సాధించాడు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
60 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన ధావన్.. మాక్స్వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులో బెయిర్ స్టో(37), రాజపక్స ఉన్నారు.
రెండు ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్: 30/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో(27), ధావన్(2) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
ఐపీఎల్-2022లో భాగంగా బ్రబౌర్న్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
ఆర్సీబీ
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
పంజాబ్ కింగ్స్
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
Related News By Category
Related News By Tags
-
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..!
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించడంలో విఫలమ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 వి...
-
'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది'
ఐపీఎల్ 2022 సీజన్ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్లు ఫామ్ కోల్పోయ...
-
IPL 2022 Playoffs: రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు.. ఫైనల్లో గుజరాత్‌తో ఢీ
ఆర్సీబీను చిత్తు చేసిన రాజస్తాన్ రాయల్స్.. ఫైనల్లో గుజరాత్‌తో ఢీ ఐపీఎల్-2022 ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ అడుగు పెట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైయర్-2లో ఆర్సీబీపై 7 వికెట్ల...
-
IPL 2022: పాపం ధావన్... తన తప్పు లేకున్నా తన్నులు తిన్నాడు!
IPL 2022: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న గబ్బర్ ఎప్పటికప్పుడు తనకు సంబంధ...
-
సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..?
IPL 2022 LSG Vs RCB- Rajat Patidar: ఐపీఎల్-2022లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 54 బంతు...
Comments
Please login to add a commentAdd a comment