IPL 2023 RCB Vs MI: Tilak Varma Helicopter Shot Against RCB, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2023 RCB Vs MI: వారెవ్వా తిలక్‌.. ధోనిని గుర్తు చేస్తూ హెలికాప్టర్ షాట్‌! వీడియో వైరల్‌

Published Mon, Apr 3 2023 4:54 PM | Last Updated on Mon, Apr 3 2023 5:23 PM

Tilak Varma Helicopter Shot Goes Viral Vs RCB - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైనప్పటికీ తిలక్‌ వర్మ మాత్రం అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

రోహిత్‌, సూర్య కుమార్‌ వంటి స్టార్‌ బ్యాటర్లు విఫలమైన చోట వర్మ తన అద్భుత ఇన్నింగ్స్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 84 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడు అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.

ధోనిని గుర్తు చేసిన తిలక్‌ వర్మ..
ఇక ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ సీఎస్‌కే కెప్టెన్‌, టీమిండియా మాజీ సారథి ఎంస్‌ ధోనిని గుర్తు చేశాడు. ధోని స్టైల్‌లో వర్మ హెలికాప్టర్ షాట్ ఆడాడు. ముంబై ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో చివరి బంతికి తిలక్‌ వర్మ హెలికాప్టర్ షాట్ రూపంలో అద్భుతమైన సిక్స్‌ బాదాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన వర్మపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు కచ్చితంగా భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
చదవండి: IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement