Photo Courtesy: IPL
ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం
చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. చివరి బంతికి ఐదు పరుగులు కావల్సిన నేపథ్యంలో శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టి ఆర్సీబీనీ గెలిపించాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆదిలోనే కోహ్లి, పడిక్కల్ వికెట్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో శ్రీకర్ భరత్, డివిలియర్స్ ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. డివిలియర్స్ ఔటయ్యాక వచ్చిన మాక్స్‌వెల్(51) తో కలిసి శ్రీకర్ భరత్ ఆర్సీబీను విజయతీరాలకు చేర్చాడు. కాగా ఐపీఎల్‌లో భరత్ తొలి అర్ధసెంచరీనీ నమోదు చేశాడు. అతడు 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు.
అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. శిఖర్ ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేయగా, పృథ్వీ షా 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కాగా ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, చహల్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు
మూడో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ.. డివిలియర్స్(26) ఔట్
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఛేజింగ్‌లో తడబడుతుంది. 55 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డివిలియర్స్ (26) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రీకర్ భరత్(39) , గ్లెన్ మాక్స్‌వెల్ (5) పరుగులతో ఉన్నారు.
రెండు వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ.. 23/2
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి 4 పరుగులు చేసి ఔటవ్వగా.. పడిక్కల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ స్కోరు 4 ఓవర్లలో 23/2గా ఉంది
ఆర్సీబీ టార్గెట్ 165..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. శిఖర్ ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేయగా, పృథ్వీ షా 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కాగా ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, చహల్, డేనియల్ క్రిస్టియన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
నాలగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. శ్రేయస్ అయ్యర్(18) ఔట్
143 పరుగుల వద్ద ఢిల్లీ నాలగో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(18) క్రిస్టియన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షిమ్రాన్ హెట్‌మైర్(21), రిపల్ పటేల్ (1) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్(10) ఔట్
108 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. డేనియల్ క్రిస్టియన్ బౌలింగ్‌లో పంత్(10) వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(4), షిమ్రాన్ హెట్‌మైర్(2) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
దూకుడగా ఆడుతున్న పృథ్వీ షా వికటె్‌ను ఢిల్లీ కోల్పోయింది. 48 పరుగలు చేసిన పృథ్వీ షా యజ్వేంద్ర చహల్ బౌలింగ్‌లో జార్జ్ గార్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధావన్(43) ఔట్
శిఖర్ ధావన్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకు ఓపెనర్లు 88 పరుగుల శుభారంభం ఇచ్చారు. 43 పరుగులు చేసిన ధావన్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో డేనియల్ క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(42), రిషబ్ పంత్(5) పరుగులతో ఉన్నారు.
Photo Courtesy: IPL
నిలకడగా ఆడతున్న ఢిల్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ నిలకడగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా(20), శిఖర్ ధావన్(22) పరుగులతో ఉన్నారు.
Photo Courtesy: IPL
దుబాయ్: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా 14ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే సమయంలో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు తొలిసారి ప్రారంభం కానున్నాయి.ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ఆర్సీబీ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 1పరుగు తేడాతో ఆర్సీబీ విజయం సాదించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), రిపల్ పటేల్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్
Comments
Please login to add a commentAdd a comment